IBPS Recruitment 2022: Total 6932
Probationary Officer / Management Trainee Posts - Final Results Released
ఐబీపీఎస్ లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్లు / మేనేజ్ మెంట్ ట్రెయినీల ఖాళీలు – పూర్తి
వివరాలు ఇవే
====================
UPDATE 02-04-2023
మెయిన్స్ &
ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాలు విడుదల
ప్రభుత్వ
బ్యాంకుల్లో 6,932 ప్రొబేషనరీ ఆఫీసర్ (సీఆర్పీ పీవో/
ఎంటీ XII-
2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ లో
ప్రిలిమ్స్ ను, నవంబర్ లో మెయిన్స్ పరీక్షలను
ఐబీపీఎస్ నిర్వహించింది. ఇంటర్వ్యూ అనంతరం ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు
హాజరైన అభ్యర్ధులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఫలితాలకు సంబంధించిన లింక్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
====================
UPDATE 05-01-2023
Main Exams Results Released – మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదల
====================
UPDATE
03-11-2022
Preliminary
Exams Results Released – ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
====================
UPDATE 07-10-2022
Call Letter for
Online Preliminary Exam – ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
దేశంలోని
వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్ మెంట్ ట్రైనీ
పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఆన్ లైన్ ప్రాథమిక పరీక్షకు సంబంధించిన హాల్
టికెట్ల(కాల్ లెటర్)ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల
చేసింది. అధికారిక వెబ్ సైట్ లో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు
వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15, 16న ప్రాథమిక పరీక్ష జరుగనుంది. అభ్యర్థులు తమ రిజిస్టేషన్
లేదా రూల్ నెంబర్, పాస్ వర్డ్ లేదా
పుట్టినరోజు వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. .
ప్రిలిమ్స్ పరీక్షా
తేదీలు: అక్టోబర్ 15 & 16
====================
దేశవ్యాప్తంగా
ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్
బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ (ఐబీపీఎస్ పీవో/ ఎంటీ- 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6932 పోస్టులు భర్తీ చేయనున్నారు.
బ్యాంకుల
వారీగా ఖాళీల వివరాలివే…
* బ్యాంక్ ఆఫ్
ఇండియా: 535
* బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర: 500
* కెనరా
బ్యాంక్: 2500
* పంజాబ్
నేషనల్ బ్యాంక్: 500
* పంజాబ్ సింధ్
బ్యాంక్: 253
* యూకో
బ్యాంక్: 550
* యూనియన్
బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094
మొత్తం
ఖాళీలు: 6932
అర్హత: ఏదైనా
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి.
ఎంపిక
విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య మైన
తేదీలు…
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 2, 2022.
ఆన్‌లైన్
రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది: ఆగస్టు 22, 2022
ప్రీ-ఎగ్జామ్
ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, అక్టోబరు 2022.
ప్రీ-ఎగ్జామ్
ట్రైనింగ్: సెప్టెంబర్/ అక్టోబరు 2022.
ప్రిలిమినరీ
పరీక్ష కాల్ లెటర్ డౌన్ లోడ్: అక్టోబర్ 2022
ఆన్లైన్
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 2022
ప్రిలిమినరీ
పరీక్ష ఫలితాలు: నవంబర్ 2022
మెయిన్
ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్ 2022
ఆన్ లైన్
మెయిన్ ఎగ్జామ్: నవంబర్ 2022
మెయిన్
ఎగ్జామ్ ఫలితాలు: డిసెంబర్ 2022
ఇంటర్వ్యూ
కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2023
ఇంటర్వ్యూలు:
జనవరి/ ఫిబ్రవరి 2023
తుది
నియామకాలు: ఏప్రిల్ 2023.
APPLY HERE (turn your
mobile)
0 Komentar