జూనియర్
కళాశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద లెక్చరర్లకు
బీఈడీ తప్పనిసరి
జూనియర్
కళాశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద
లెక్చరర్లు బీఈడీ చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు
సీబీఎస్ఈకి అనుబంధంగా మారుతున్నందున ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డు ఉండదు. దీన్ని
పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారు.
సీబీఎస్ఈలో
ఇంటర్మీడియట్ ను +1,+ 2గా పరిగణిస్తారు.
బీఈడీ అర్హత ఉన్నవారే +1,+ 2కు బోధించాలి.
ప్రస్తుతం చాలామందికి బీఈడీ లేదు. 2026లోగా జూనియర్ లెక్చరర్లు ఈ కోర్సు పూర్తి చేయాలి. ఈ కోర్సు అందించేందుకు ఇంటర్
విద్యాశాఖ ఇగ్నోతో సంప్రదింపులు జరుపుతోంది.
0 Komentar