JVVD Scheme: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2022
జగనన్న
విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హుల నుంచి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. క్యూఎస్ ర్యాంకుల ప్రకారం ఉన్నతశ్రేణి 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులు
అభ్యసించడానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కాపు కులాలకు చెందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను
కోరుతోంది.
జగనన్న
విదేశీ విద్యా దీవెన పథకం 2022
అర్హతలు:
డిగ్రీ,
పీజీ, ఇంటర్మీడియట్
కోర్సుల్లో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్
ను కలిగి ఉండాలి. టోఫెల్, ఐఈఎల్ టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్, నీట్ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించి వయసు ఉండకూడదు.
ఆర్థిక సాయం:
వంద శాతం లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలో
ప్రవేశాలు పొందితే ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. 101 నుంచి 200 లోపు ర్యాంకు గల
విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు
ఏది తక్కువ అయితే దాని ప్రకారం చెల్లిస్తుంది.
ఆన్ లైన్
రిజిస్ట్రేషన్ కు చివరి తేది: 30-09-2022.
0 Komentar