Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: “Deen Dayal SPARSH Yojana” Scholarship Scheme for the Year 2022 – 23

 

TS: “Deen Dayal SPARSH Yojana” Scholarship Scheme for the Year 2022 – 23

టీఎస్: 6వ తరగతి నుండి 9వ తరగతుల విద్యార్ధులకు "దీన్ దయాళ్ స్పర్ష్ యోజన" స్కాలర్‌షిప్ పథకం – వివరాలు ఇవే

భారతీయ తపాలా శాఖ 2022-2023 సంవత్సరానికి దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్కాలర్ షిప్ ప్రోగ్రాం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా హాబీగా స్టాంపులలో అభిరుచి, పరిశోధనలో ప్రోత్సాహం కోసం తెలంగాణలోని ఆరో తరగతి - తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

హాబీగా స్టాంపులలో అభిరుచి, పరిశోధనలో ప్రోత్సాహం కోసం స్కాలర్‌షిప్స్

మొత్తం స్కాలర్‌షిప్స్: 920 (ప్రతి పోస్టల్ సర్కిల్ కు 40 స్కాలర్ షిప్స్ అందజేస్తారు)

స్కాలర్ షిప్ మొత్తం: ఏడాదికి రూ. 6000 (నాలుగు త్రైమాసికాల్లో రూ.1500 చొప్పున) అందజేస్తారు.

అర్హత: ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు. వీరికి మంచి అకడమిక్ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉండాలి. స్కాలర్ షిప్ సమయంలో అభ్యర్థులు ఫైనల్ ఎగ్జామ్స్ లో కనీసం 60 శాతం మార్కులు/ తత్సమాన గ్రేడ్ పాయింట్ ను సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: దీనికి ఎంపిక ప్రక్రియ రెండు స్థాయిల్లో జరుగుతుంది.

అవి 1) ఫిలాటెలీ రిటన్ క్విజ్ 2) ఫిలాటెలీ ప్రాజెక్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.08.2022.

చిరునామా: Assistant Director (Philately), o/o Chief Postmaster General, Telangana Circle, Dak Sadan, Abids, Hyderabad-500001.

NOTIFICATION

APPLICATION

GUIDELINES

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags