Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSLPRB: పోలీస్ రాతపరీక్ష లో బయోమెట్రిక్ విధానం – పరీక్షకి ముందు సూచనలు ఇవే

 

TSLPRB: పోలీస్ రాతపరీక్ష లో బయోమెట్రిక్ విధానం – పరీక్షకి ముందు సూచనలు ఇవే

పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయనున్నారు. ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష జరగనుండటంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు వాటిలో వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. 554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 35 పట్టణాల్లో సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వెల్లడించింది. బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్లకు మెహిందీ, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరని మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉదయం పది గంటలకు పరీక్ష జరగనుండటంతో గంట ముందే కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషమైనా అనుమతించరు.

హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటో ఉంటేనే అనుమతి

అభ్యర్థులు హాల్ టికెట్లను టీఎస్ఎల్‌పీఆర్ బీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు . జులై 30న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5న రాత్రి 12 గంటల వరకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాల్ టికెట్లను ఏ4 సైజ్ లోనే డౌన్ లోడ్ చేసుకోవాలి. పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని మరో పేజీలో కాకుండా అదే కాగితంపై వెనకవైపు ప్రింటవుట్ తీసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్లో సరిపోతుంది. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫొటోను అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్ కాపీలో ఉంచినటువంటి ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిర్లు కొట్టాడు. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు. ఒకవేళ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడంలో ఏవైనా సమస్యలుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. లేదా support@tslprb.in కు మెయిల్ పంపి సహాయం పొందొచ్చు.

పరీక్షకి ముందు సూచనలు ఇవే

* అభ్యర్థులు సెల్ ఫోన్, టాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, చేతిగడియారం, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకెళ్లరాదు.

* నగలు ధరించరాదు. హ్యాండ్ బ్యాగ్, పౌచ్ తీసుకురావద్దు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి - క్లాస్ రూంలు ఉండవు.

* అభ్యర్థులు హాల్ టికెట్ తోపాటు బ్లాక్ లేదా బ్లూ బాల్పెయింట్ పెన్నులను మాత్రమే లోనికి తీసుకెళ్లాలి.

 * ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారు.

* పరీక్షలో నెగెటివ్ మార్కులున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది.. పరీక్షపత్రం బుక్ లో ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్ వెర్షన్ నే పరిగణనలోకి తీసుకోవాలి.

======================

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags