తెలంగాణ మహిళ, శిశు సంక్షేమ శాఖలో 181 ఎక్స్టెన్సన్ ఆఫీసర్ పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.35,720 -
1,04,430.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) అర్హత
కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్-1: 181 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు:
1. కాళేశ్వరం- 26
2. బాసర- 27
3. రాజన్న- 29
4. భద్రాద్రి- 26
5. యాదాద్రి- 21
6. చార్మినార్- 21
7. జోగులాంబ- 31
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ(హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/
సోషియాలజీ) . లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్), బీఎస్సీ (ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ
(అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ) . లేదా బీఎస్సీ(క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ)
. లేదా బీఎస్సీ (అప్లెడ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ) . లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ & కెమిస్ట్రీ/ బయోలాజికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
వయస్సు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాలు.
జీత భత్యాలు: నెలకు రూ.35,720 - 1,04,430.
దరఖాస్తు రుసుము: రూ.200.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా
ఎంపిక చేస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1(జనరల్
స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), పేపర్-2 సంబంధిత
సబ్జెక్టు(డిగ్రీ స్థాయి)లో ప్రశ్నలుంటాయి. పేపర్-1లో 150 ప్రశ్నలు, పేపర్-2లో 150 ప్రశ్నలు..
మొత్తం 300 ప్రశ్నలుంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 08.09.2022.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.09.2022.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): డిసెంబర్, 2022.
0 Komentar