UPSC One Time
Registration (OTR): Check the Details Here
యూపీఎస్సీ లో
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కి అవకాశం – పూర్తి
వివరాలు ఇవే
ప్రభుత్వ
కొలువుల సాధనకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని ప్రారంభించింది. ఇకపై
కమిషన్ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఓటీఆర్ ప్లాట్ ఫాంలో తమ
ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవాలి. ఇందుకు www.upsc.gov.in,
www.upsconline.nic.in లలో ఓటీఆర్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తెచ్చినట్లు కమిషన్
ఆగస్టు 24న ఓ ప్రకటనలో తెలిపింది.
'ఓటీఆర్
చేసుకున్న వారు.. భవిష్యత్తులో ఆన్లైన్లో ఎన్ని ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు
చేసుకున్న ఆయా ప్రాథమిక వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో
అభ్యర్థులకు సమయం ఆదా కావడంతో పాటు.. దరఖాస్తు విధానం సులభతరమవుతుంది' అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సివిల్ సర్వీసెస్
పరీక్షలను ఎన్నిసార్లు రాయవచ్చనే విషయంలో 'తరచూ అడిగే
సందేహాల పేరుతో' సమాచారాన్ని కమిషన్ అందుబాటులోకి
తెచ్చింది.
0 Komentar