Accenture Off
Campus Drive 2022: Associate Software Engineering Posts –
Details Here
యాక్సెంచర్ లో
అసోసియేట్ సాఫ్ట్వేర్ ఖాళీలు – జీతభత్యాలు: ఏటా రూ.4,50,000 వరకు
యాక్సెంచర్ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పోస్టులు:
అర్హత: బీఈ/
బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ (సీఎస్ఈ/ ఐటీ) ఉత్తీర్ణత. దూరవిద్య ద్వారా
ఎంబీఏ/ పీజీడీఎం పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.
పని అనుభవం: 0-11 నెలలు ఉండాలి.
జీతభత్యాలు:
ఏటా రూ.4,50,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక
విధానం:
1. మాక్ అసెస్ మెంట్: 20 నిమిషాల మాక్/
ప్రాక్టీస్ అసెస్మెంట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు సరైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఇంటర్నెట్
ఉందని నిర్ధారణకు వస్తారు.
2. కాగ్నిటివ్, టెక్నికల్ అసెస్ మెంట్: ఇందులో 90 నిమిషాల సమయంలో 50 ప్రశ్నలకు
సమాధానాలు రాయాలి. అభ్యర్థుల ఇంగ్లీష్ సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార
నైపుణ్యాలు పరిశీలిస్తారు. పరీక్షలో భాగంగా అబ్ స్టాక్ట్ రీజనింగ్, సూడోకోడ్, నెట్ వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్ తదితర
అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
3. కోడింగ్ అసెస్మెంట్
4. కమ్యూనికేషన్ అసెస్ మెంట్.
పని
ప్రదేశాలు: బెంగళూరు, హైదరాబాద్, పుణె, ముంబయి, చెన్నై, గురుగావ్, కోల్‌కతా.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
0 Komentar