తెలుగు రాష్ట్రాల్లో
2022 సంవత్సరపు దసరా సెలవుల వివరాలు ఇవే
Andhra Pradesh:
ఆంధ్రప్రదేశ్
లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 6 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అదివారాలతో కలిపి మొత్తం గా
12 రోజులు సెలవులు లభించాయి.
క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకు సెలవులు
ఇచ్చారు. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో
పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా
ప్రకటించారు.
Telangana:
తెలంగాణ
ప్రభుత్వం విద్యార్థులకు ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా
ప్రకటించింది.
దసరా పండుగ
నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు
ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్ 10వ తేదీన
విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, 5వ తేదీన
దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక అక్టోబర్
5వ తేదీన దసరా పండుగ జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం 13 రోజులు సెలువులు ప్రకటించినప్పటికీ విద్యార్థులకు మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 25, అక్టోబర్ 9న ఆదివారాలు
కావడమే దీనికి కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో సెలవులను పెంచిన విషయం తెలిసిందే.
0 Komentar