FCI Recruitment
2022: Apply for 5043 Assistant Grade 3 Posts – Details Here
భారత ఆహార
సంస్థలో 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – పూర్తి
వివరాలు ఇవే
న్యూదిల్లీలోని
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా . . .
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నఎఫ్ సీఐ డిపోలు, కార్యాలయాల్లో
జోన్ల వారీగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది.
కేటగిరీ-3
నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు
1. జూనియర్
ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్)
2. జూనియర్
ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్)
3.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2
4. అసిస్టెంట్
గ్రేడ్-3 (జనరల్)
5.
అసిస్టెంట్ గ్రేడ్-3 (అకౌంట్స్)
6.
అసిస్టెంట్ గ్రేడ్-3 (టెక్నికల్)
7.
అసిస్టెంట్ గ్రేడ్-3 (డిపో)
8.
అసిస్టెంట్ గ్రేడ్-3 (హిందీ)
జోన్ల వారీగా
ఖాళీలు:
1. నార్త్ జోన్: 2388 పోస్టులు
2. సౌత్ జోన్: 989 పోస్టులు
3. ఈస్ట్ జోన్: 768 పోస్టులు
4. వెస్ట్ జోన్: 713 పోస్టులు
5. నార్త్ ఈస్ట్ జోన్: 185 పోస్టులు
అర్హత:
పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ, జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్
సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/
సివిల్),
డిప్లొమా (సివిల్/ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), స్కిల్/
టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం , రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు
రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి
మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 06.09.2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.
ఆన్‌లైన్
పరీక్ష తేదీ: జనవరి, 2023.
0 Komentar