ICC Introduces New Rules in Cricket from
Oct 1, 2022 – Details Here
అక్టోబర్ 1, 2022 నుంచి అమలు కానున్న క్రికెట్ లో కొత్త నియమాలు ఇవే
క్రికెట్ లో కొన్ని నియమాలను మార్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మార్పులను ఐసీసీ వెల్లడించింది. ఎంసీసీ 2017 క్రికెట్ కోడ్ చట్టాల మూడో ఎడిషన్ అప్డేషన్ల గురించి గంగూలీ నేతృత్వంలోని కమిటీ చర్చించి కొత్త ప్రతిపాదనలు చేసింది. వీటిని ఆ తర్వాత మహిళల క్రికెట్ కమిటీతోనూ పంచుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనలివే..
1. బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. స్ట్రయికర్ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాటర్
వస్తారు. క్యాచ్ పట్టే సమయంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ చేసినా పరిగణనలోకి
తీసుకోరు.
2. బాల్ కు ఉమ్మి రాయడం పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది. కొవిడ్
పరిస్థితుల్లో ఈ నిబంధన గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేస్తున్నారు.
ఇప్పుడూ దీన్ని శాశ్వతం చేయడంతో. ఇకపై బంతికి ఉమ్మిని రాయడం కుదరదు.
3. టెస్టులు, వన్డేల్లో ఇన్ కమింగ్ బ్యాటర్ రెండు
నిమిషాల్లోనే స్ట్రైక్ తీసుకోవడానికి సిద్ధం కావాలి. టీ 20ల్లో ఇందుకోసం ఉన్న 90 సెకన్ల
సమయంలో ఎలాంటి మార్పు లేదు.
4. బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. ఫీల్డింగ్ లో ఏదైనా ఉద్దేశపూర్వకమైన, అనైతిక కదలికలు చోటుచేసుకుంటే ఆ బాల్ ను డెడ్ బాల్ గా
ప్రకటిస్తారు. దీంతో అంపైర్ బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు
ఇవ్వొచ్చు.
5 . 'మన్కడింగ్' రూపంలో చేసే రనౌట్ ను ఇక మీదట 'అన్ ఫెయిర్ ప్లే' సెక్షన్
నుంచి 'రన్ అవుట్ సెక్షన్ లోకి మార్చారు.
6. బౌలర్ బాల్ వేయకముందే బ్యాటర్ వికెట్ల నుంచి కాస్త ముందుకు జరిగి ఆడేందుకు
ప్రయత్నిస్తే.. బంతిని విసిరి స్ట్రైకర్ ను రనౌట్ చేసేవారు. ఇప్పుడు ఇలాంటి
ప్రయత్నం చేస్తే దాన్ని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు.
7. టీ20ల్లో జనవరి 2022లో ప్రవేశ పెట్టిన మ్యాచ్ పెనాల్టీని వన్డేలకు కూడా అమలు చేయనున్నారు. దీంతో
వన్డేల్లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే.. ఆ మిగిలిన ఓవర్లలో బౌండరీ
దగ్గర నుంచి 30 యార్డ్స్ సర్కిల్ లోకి ఫీల్డర్ ను
తీసుకురావాల్సి ఉంటుంది. 2023లో ఐసీసీ పురుషులు
వరల్డ్ కప్ లీగ్ పూర్తయిన అనంతరం ఇది అమలులోకి రానుంది.
8. బౌలర్ వేసే బంతిని ఆడేటప్పుడు బ్యాట్ కొంత భాగమైనా లేదంటే బ్యాటర్ పిచ్ పైనే
ఉండాలి. అలా కాకుండా పిచ్ బయటకు వచ్చి ఆడితే.. దానిని డెడ్ బాల్ గా పరిగణిస్తారు.
ఒకవేళ బౌలర్ వేసిన బంతి బ్యాటర్ ను పిచ్ బయటకు రప్పించేలా ఉంటే.. నోబాల్ గా
ప్రకటిస్తారు.
A host of important changes to the Playing Conditions that come into effect at the start of next month 👀https://t.co/4KPW2mQE2U
— ICC (@ICC) September 20, 2022
0 Komentar