IRCTC: Passengers
Check PNR, Live Train Status and Order Food on WhatsApp – Details Here
ఐఆర్‌సీటీసీ: ప్రయాణీకులు వాట్సాప్‌లో PNR, లైవ్ ట్రైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు
మరియు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు – వివరాలు ఇవే
ట్రైన్
టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, దాని స్టేటస్
తెలుసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ నో.. థర్డ్ పార్టీకి చెందిన యాప్/ వెబ్ సైట్
నో ఆశ్రయించాల్సిందే. స్టేటస్ తెలుసుకోవాల్సిన ప్రతిసారీ అందులో PNR నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా
వాట్సాప్ ద్వారానే సులువుగా PNR స్టేటస్
తెలుసుకోవచ్చు. ముంబయికి చెందిన స్టార్టప్ రైలో పై (Railofy) ఐఆర్‌సీటీసీ తో
కలిసి ఈ సేవలను అందిస్తోంది.
వాట్సాప్
చాట్ బాట్ ద్వారా ఈ సేవలు లభిస్తాయి. ఇందుకోసం ఆ సంస్థ ఫోన్ నంబర్ ను (+91 98811 93322) మీ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత
వాట్సాప్ లో చాట్ విండోలోకి వెళ్లి పీఎస్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేసి దాని స్టేటస్
తెలుసుకోవచ్చు. అలాగే మునుపటి స్టేషన్, రాబోయే
స్టేషన్ వివరాలు సైతం పొందొచ్చు.
ట్రైన్లోకి
ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చని రైలోపై తన వెబ్ సైట్లో పేర్కొంది. 139కి కాల్ చేయడం ద్వారా కూడా ఈ సేవలను పొందొచ్చు.
ఫుడ్
డెలివరీకి సంబంధించి జూప్ అనే మరో సంస్థ కూడా ఈ తరహా సేవలనే అందిస్తోంది. ఇందుకోసం
+91
7042062070 నంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే
మీకు నచ్చిన ఆహారాన్ని మీ బెర్త్ దగ్గరకే అందిస్తారు.
=======================
=======================
=======================
0 Komentar