Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Roger Federer Announces Retirement from Professional Tennis

 

Roger Federer Announces Retirement from Professional Tennis

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ - 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళతో కెరీర్ ముగింపు

దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ (41) ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ లను ఫెదరర్ నెగ్గాడు. ఈ క్రమంలో లండన్ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరిగే లావెర్ కప్ ఏటీపీనే తనకు చివరదని ప్రకటించాడు.

పురుషుల టెన్నిస్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫెడెక్స్ (ఫెదరర్ ముద్దు పేరు).. ట్విటర్ లో ఫేర్ వెల్ సందేశాన్ని పంపాడు. టెన్నిస్ కుటుంబానికి ప్రేమతో రోజర్ అనే క్యాప్షన్ తో ఏవీని షేర్ చేశాడు.

ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఎనిమిదిసార్లు వింబుల్డన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ ను కైవసం చేసుకొన్నాడు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ టెన్నిస్ ఆడతానని, అయితే ఏటీపీ, గ్రాండ్ స్లామ్ పోటీల్లో ఆడనని ట్విటర్ వేదికగా వెల్లడించాడు.

1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన ఫెదరర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 82 శాతం విజయాలు (1251-275) సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజతం గెలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం పతకం అందుకొన్నాడు. అయితే ఫెదరర్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతూ ఇబ్బంది పడ్డాడు. గత యూఎస్ ఓపెన్లోనూ పాల్గొనలేకపోయాడు.

ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) గా పిలువబడే ఫెడెక్స్ తన కెరీర్ లో మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాడు. కెరీర్ లో 1500కు పైగా మ్యాచ్ లు ఆడిన అతను.. 310 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ గా కొనసాగాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags