Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2022: All the Details for 1673 Probationary Officer Posts

 

SBI Recruitment 2022: All the Details for 1673 Probationary Officer Posts

ఎస్బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960. 

====================

UPDATE 10-02-2023

ప్రధాన పరీక్ష (Main) ఫలితాలు విడుదల

ఎస్బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల (ప్రకటన నం: సీఆర్పీడీ/ పీవో/2022-23/18)కు సంబంధించి ప్రధాన పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ మార్చి 10న విడుదల చేసింది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు జనవరి 30న మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫేజ్ 3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్ బీఐ తాజాగా ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

CLICK FOR RESULTS

WEBSITE

====================

UPDATE 19-01-2023

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో 1,673 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు జనవరి 17న విడుదలయ్యాయి. పీవో నియామక ప్రాథమిక పరీక్షలను డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో ఎస్బీఐ నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

CLICK FOR RESULTS

WEBSITE

====================

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్ మెంట్ & ప్రమోషన్ డిపార్ట్ మెంట్... పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 22.09.2022 నుంచి 12.10.2022 వరకు అవకాశం ఉంది. అభ్యర్థిని ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్: 1673 పోస్టులు (ఎస్సీ- 270, ఎస్టీ- 181, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్- 160, యూఆర్-648)

ఖాళీలు: రెగ్యులర్- 1600; బ్యాక్ లాగ్- 73.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి (01.04.2022 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960.

దరఖాస్తు రుసుము: రూ. 750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు / ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం , కరీంనగర్, వరంగల్.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్టేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 22.09.2022 నుంచి 12.10 .2022 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్లోడ్: 2022, డిసెంబర్ మొదటి / రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్ 1- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022, డిసెంబర్ 17/ 18/ 19/ 20.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2022 / జనవరి 2023.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి 2023 / ఫిబ్రవరి 2023.

స్టేజ్ 2- ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామ్: జనవరి 2023 / ఫిబ్రవరి 2023.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్లోడ్: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి 2023.

ఇంటర్వ్యూ & గ్రూప్ ఎక్సర్ సైజ్ తేదీలు: ఫిబ్రవరి/ మార్చి 2023.

తుది ఫలితాల ప్రకటన: మార్చి 2023.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags