SSC CGL Exam 2022: All the Details Here for
20,000 Posts
ఎస్ఎస్సీ-
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్-2022: పూర్తి వివరాలు ఇవే -మొత్తం ఖాళీల సంఖ్య: 20,000
======================
UPDATE 10-02-2023
సీజీఎల్ 2022 టైర్-1 ఫలితాలు విడుదల
వివిధ
విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) 2022 టైర్-1 ఫలితాలు ఫిబ్రవరి 9న విడుదలయ్యాయి. ఈ పరీక్షలు గత డిసెంబర్లో దేశవ్యాప్తంగా
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగాయి. టైర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్-2 పరీక్షకు
సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం కీతో పాటు ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక
వెబ్సైట్లో చూసుకోవచ్చు.
SSC-CGL-Tier-1-Result-2023-List-1
SSC-CGL-Tier-1-Result-2023-List-2
SSC-CGL-Tier-1-Result-2023-List-3
======================
స్టాఫ్
సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్)
పరీక్ష-2022కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా
వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి
విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఖాళీల సంఖ్య:
20,000
భర్తీ
చేయనున్న పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
4. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఐబీ)
5. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎవోఆర్)
6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎంవోఈ ఏ)
7. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎఫ్ హెచ్ క్యూ)
8. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఈ&ఐటీ)
9. అసిస్టెంట్
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
11. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్
12. ఇన్ స్పెక్టర్ (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)
13. ఇన్ స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
14. ఇన్ స్పెక్టర్ (ఎగ్జామినర్)
15. అసిస్టెంట్ ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్
16. సబ్ ఇన్ స్పెక్టర్
17. ఇన్ స్పెక్టర్ (పోస్ట్ డిపార్ట్ మెంట్)
18. అసిస్టెంట్/ సూపరింటెండెంట్
19. అసిస్టెంట్
20. అసిస్టెంట్ (ఎన్‌సీఎల్‌టీ)
21. రిసెర్చ్ అసిస్టెంట్
22. డివిజనల్ అకౌంటెంట్
23. సబ్ ఇన్ స్పెక్టర్
24. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
25. ఆడిటర్ (సీ&ఏజీ)
26. ఆడిటర్
27. ఆడిటర్ (సీజీడీఏ)
28. అకౌంటెంట్
29. అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్
30. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ / అప్పర్ డివిజన్ క్లర్క్
31. ట్యా క్స్ అసిస్టెంట్
32. సబ్-ఇన్ స్పెక్టర్
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/
పీజీ డిగ్రీ (కామర్స్/ ఎకనామిక్స్/ బిజినెస్ స్టడీస్)/ ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత
ఉండాలి.
వయోపరిమితి: 01.01.2022 నాటికి ఖాళీలను అనుసరించి 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్
టెస్ట్,
ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ
సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం , హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022.
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరితేది: 08.10.2022. 13.10.2022
ఆన్లైన్
చలానా జనరేషన్‌కు చివరితేది: 08.10.2022. 13.10.2022
ఆన్ లైన్
ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.10.2022. 14.10.2022
చలానా ద్వారా
ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.10.2022. 15.10.2022
దరఖాస్తుల
సవరణ తేదీలు: 12.10 .2022 నుంచి 13.10.2022
(28:00) వరకు.
19.10 .2022 నుంచి 20.10.2022 (28:00) వరకు.
టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2022.
టైర్-2 పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది.
ఎలా దరఖాస్తు
చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 9 ని చూడండి.
0 Komentar