UPSC Combined
Geo-Scientist Examination 2023: - Apply for 285 Posts – All the Details Here
యూపీఎస్సీ - కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023: మొత్తం 285 పోస్టుల పరీక్ష కు దరఖాస్తు వివరాలు ఇవే
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్
ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ
పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్
గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ
ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఖాళీల
వివరాలు …
కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ.
1. జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 216 పోస్టులు
2. జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 21 పోస్టులు
3. కెమిస్ట్, గ్రూప్-ఎ: 19 పోస్టులు
కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ.
4. సైంటిస్ట్ 'బి' (హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 26 పోస్టులు
5. సైంటిస్ట్ 'బి' (కెమికల్), గ్రూప్-ఎ: 01 పోస్టు
6. సైంటిస్ట్ 'బి'(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 285.
అర్హత:
మాస్టర్ డిగ్రీ (జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో
ఎక్స్ప్లోరేషన్/ మినరల్ ఎక్స్ ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/
మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/
అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)-
అప్లైడ్ జియోఫిజిక్స్.
వయోపరిమితి: 1.1.2023 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు
రుసుము: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక, పరీక్ష విధానం: స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్
జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ
పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్ పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్ కతా, లఖ్నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్
రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 11-10-2022.
దరఖాస్తుల
ఉపసంహరణ తేదీలు: 19.10.2022 నుంచి 25.10.2022 వరకు.
ప్రిలిమినరీ
పరీక్ష తేదీ: 19-02-2023.
మెయిన్
పరీక్ష తేదీలు: 24 & 25-06-2023
=======================
UPSC OTR: యూపీఎస్సీ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కి అవకాశం
=======================
0 Komentar