Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open Men’s Final 2022: Carlos Alcaraz beats Casper Rudd to Claim First Grand Slam Title and No.1 Rank

 

US Open Men’s Final 2022: Carlos Alcaraz beats Casper Rudd to Claim First Grand Slam Title and No.1 Rank

US ఓపెన్ పురుషుల ఫైనల్ 2022: మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ మరియు నం.1 ర్యాంక్ ని అందుకున్న 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్

యూఎస్ ఓపెన్ లో అనూహ్యంగా టైటిల్ బరిలో నిలిచి హోరాహోరీగా తలపడ్డారు ఇద్దరు యువ క్రీడాకారులు. ఇద్దరికీ ఇదే తొలి యూఎస్ ఓపెన్ ఫైనల్. అయినప్పటికీ ఒత్తిడిని చిత్తు చేస్తూ నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు. అయితే చివరికి విజయం స్పెయిన్ యువ సంచలనం, 19 ఏళ్ల కుర్రాడు అల్కరాజ్ నే వరించింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో గెలుపొందాడు. దీంతో పాటు అతడు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

స్పెయిన్ కే చెందిన దిగ్గజ ఆటగాడు రఫేల్ నాదల్ 2005లో అతిపిన్న (19 ఏళ్లు) వయసు ఆటగాడిగా తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేదు. తాజాగా అల్కరాజ్ ఆ రికార్డును సమం చేయడంతో పాటు 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా అల్కరాజ్ నిలిచాడు.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం కోసం ఇద్దరూ తీవ్ర కృషి చేశారు. ఎక్కడా ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా తలపడ్డారు. ఈ క్రమంలో అల్కరాజ్ 6-4 తేడాతో తొలి సెట్ ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్ లో రూడ్ విజృంభించాడు. ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేసి 4-2తో అధిక్యంలో నిలిచాడు. అదే ఊపులో 6-2 తేడాతో ఆ సెట్ ను కైవసం చేసుకొని సమంగా నిలిచాడు.

ఇక మూడో సెట్లో విజయం కోసం కఠోర శ్రమ చేశారు ఇద్దరు. తొలుత ఆధిక్యంలోకి రూడ్ దూసుకువెళ్లగా, అనంతరం అల్కరాజ్ ఒత్తిడిని అధిగమించి స్కోరును సమం(6-6) చేయడంతో ఈ సెట్ టైబ్రేకర్ కు మళ్లింది. ఇందులో 7-1 (7-6) తేడాతో అల్కరాజ్ నెగ్గాడు. ఇక కీలకమైన నాలుగు సెట్లో రూడ్ చెతులెత్తేశాడు. అల్కరాజ్ తన ఆధిక్యాన్ని నిలుపుకుంటూ 6-3 తేడాతో తొలిసారి యూఎస్ కిరీటంతో పాటు, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును తన సొంతం చేసుకున్నాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags