Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WD&CW Dept, AP: Apply for 560 Extension Officer Grade-II Posts – Details Here

 

WD&CW Dept, AP: Apply for 560 Extension Officer Grade-II Posts – Details Here

ఏపీ: 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 30-09-2022

అంగన్వాడీ సూపర్ వైజర్ (గ్రేడ్-2) (పదోన్నతి పరీక్ష) నియామకం నోటిఫికేషన్ రద్దు చేశామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. నోటిఫికేషన్ రద్దు చేసేందుకు సీఎం జగన్ కూడా అంగీకరించారని చెప్పారు. న్యాయనిపుణుల సలహా మేరకు నోటిఫికేషన్ రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఫలితాలను నిలుపుదల చేశామని వెల్లడించారు. 55,607 అంగన్వాడీలు ఉండగా.. ప్రతి 25 అంగన్వాడీలకు ఒక సూపర్ వైజర్ ఉండాలి. ప్రస్తుతం అంతర్గతంగా చేపట్టిన నియమాక నోటిఫికేషన్లో 60 అంగన్వాడీలకు ఒక సూపర్ వైజర్ మాత్రమే ఉన్నారని, దీంతో 560 అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది.

దాదాపు 21వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. మొత్తం 50 మార్కులకుగాను 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ నిర్వహించినట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే, 21వేల మంది స్పోకెన్ ఇంగ్లిష్ వీడియో చూడాలంటే కష్టం కాబట్టి .. మెరిట్ లిస్ట్' ఉన్నవారు మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ విడియోలు అప్ లోడ్ చేయాలని అధికారులు సూచించారు. రూల్ ఆప్ రిజర్వేషన్ ప్రకారం పరీక్ష నిర్వహించామని, ఫలితాల వివరాలు ఎక్కడా బయట పెట్టలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక కీ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదలను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 1190 మంది అభ్యర్థుల నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోలు తెప్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

======================

UPDATE 29-09-2022

ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్-2 నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 560 గ్రేడ్-2 పోస్టుల నియామకాలకు ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. 38వేల మంది అంగన్ వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలెక్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

నిబంధనల ప్రకారం 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వీటిలో 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలన్నారు. అయితే, రాత పరీక్షను ఈ నెల 18న అధికారులు నిర్వహించారని, మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భర్తీల్లో అవకతవకలు జరిగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

======================

CLICK FOR RESULTS

======================

రాష్ట్రంలో 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్లు, సూపర్‌వైజర్లతో భర్తీ చేయనున్నారు.

అర్హులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 17 వరకు హాల్ టికెట్లు జారీ చేసి ఈ నెల 18న పరీక్ష నిర్వహిస్తారు. జోన్ల వారీగా విశాఖ 76, ఒంగోలు 126, ఏలూరు 142, కర్నూలు జోన్లో 216 ఖాళీలున్నాయి.

Memo.No.WDC02-19044/1/2021-Estt-7, Dt.02/09/2022.

Sub: - WD & CW Dept., - N.G.Estt – Filling the posts of Extension Officer Grade – II with the Eligible Anganwadi Workers and Supervisors working on contract basis by following due procedure –  Communication of draft Guidelines – Reg.

NOTIFICATION & PROCEEDINGS

APPLICATION

HALL TICKET (original)

HALL TICKET (duplicate)

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags