WhatsApp Users Should 'Immediately'
Update to Latest Versions to Fix Security Flaws: CERT-In
వాట్సాప్ తాజా వెర్షన్‌కు 'వెంటనే' అప్‌డేట్ చేయాలి: కేంద్ర ప్రభుత్వం (CERT-In) కీలక సూచన
మెసేజింగ్
కోసం ఎక్కువ మంది ఉపయోగించేది వాట్సాప్ యాప్. కేవలం మెసేజింగ్ మాత్రమే కాదు, వాయిస్/వీడియో కాలింగ్, ఫైల్ షేరింగ్, పేమెంట్ ఇలా ఎన్నో రకాల అడ్వాన్స్ ఫీచర్లు ఈ యాప్ లో
ఉన్నాయి. తాజాగా వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ యాప్ లో
సెక్యూరిటీ లోపం ఉందని తెలిపింది. ఈ బగ్ కారణంగా సైబర్ నేరగాళ్లు సులువుగా
వాట్సాప్ ను హ్యాక్ చేసి యూజర్ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది.
కేంద్ర
ప్రభుత్వం ఆధ్వర్యంలో సైబర్ దాడులను అరికట్టేందుకు కృషి చేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ
రెస్పాన్స్ టీమ్ (CERT-In) వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో వీడియో కాలింగ్ ఫీచర్ లో ఈ బగ్ ఉన్నట్లు
తెలిపింది. ఈ బగ్ సాయంతో హ్యాకర్స్ యూజర్ వాట్సాప్ ఖాతాల్లోకి ఆర్బిటరీ కోడ్ ను
ప్రవేశ పెట్టి డివైజ్ లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు గుర్తించామని వాట్సాప్ తన
రిపోర్ట్ లో పేర్కొంది. హ్యాకర్స్ తమ కంట్రోల్ లోకి తీసుకున్న డివైజ్ ల నుంచి
యూజర్ ప్రమేయం లేకుండా వీడియో కాల్ చేసి మాల్వేర్ ను ప్రవేశపెడుతున్నట్లు
తెలిపింది. తర్వాత హ్యాకర్స్ యూజర్ వ్యక్తిగతడేటాను సేకరించడంతోపాటు, వాట్సాప్ లో యూజర్ యాక్టివిటీని ట్రాక్ చేస్తున్నారని
వెల్లడించింది.
దీని పై
యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ తమ ప్రమేయం
లేకుండా ఫోన్ నుంచి వీడియో కాల్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే యాప్ ను డిలీట్ చేసి
కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవమని సూచించింది. ఈ సమస్యకు ముందస్తు పరిష్కారంగా
వాట్సాప్ అప్ డేట్ ను విడుదల చేసింది. యూజర్లు వెంటనే తమ డివైజ్ లలో వాట్సాప్ ను
అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ అప్ డేట్లను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి చేసుకోవచ్చు.
CERT-In has published an Advisory and a Vulnerability Note on its website (27.09.2022)
— CERT-In (@IndianCERT) September 28, 2022
Responding to Ransomware Attackshttps://t.co/E1PNfdIIVc
Multiple Vulnerabilities in WhatsApphttps://t.co/nGBnUNdINe
0 Komentar