APPSC Recruitment 2022: Group-1
Posts – Details Here
ఏపీపీఎస్సీ: గ్రూప్-1 పోస్టులు – అన్నీ వివరాలు ఇవే
=======================
UPDATE 17-08-2023
ఏపీపీఎస్సీ గ్రూప్-1 (28/2022) తుది ఫలితాలు విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాది 111 ఉద్యోగాలకు ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది
జనవరిలో ప్రాథమిక, జూన్ లో ప్రధాన పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన
అభ్యర్థులకు ఆగస్టులో మొదటి, రెండో వారంలో
ఇంటర్వ్యూలు నిర్వహించారు.
మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్సు కోటాలో ఒక పోస్టు నియామకంపై
త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. గ్రూప్-1లో తొలి 3 ర్యాంకులు మహిళా
అభ్యర్థులే సాధించారు.
=======================
UPDATE
19-07-2023
గ్రూప్-1 (28/2022) ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
ఇంటర్వ్యూ తేదీలు: 02/08/2023 నుండి 11/08/2023 వరకు
=======================
UPDATE
14-07-2023
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ
విడుదల చేసింది. 111 గ్రూప్-1 పోస్టులకు 259 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించగా.. వీరిలో 39 మంది
స్పోర్ట్స్ కోటా నుంచి ఎంపికయ్యారు.
జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు
మెయిన్స్ జరగ్గా.. పరీక్షలు జరిగిన 34 రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి.
ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి.
CLICK
FOR RESULTS – SELECTED LIST
=======================
UPDATE 20-06-2023
APPSC: గ్రూప్-1 (28/2022) మెయిన్స్ పరీక్షల ప్రశ్నా
పత్రాలు విడుదల 👇
Paper-II
- History and Cultural and Geography of India and Andhra Pradesh
Paper
-III - Polity, constitution, Governance, Law, and Ethics
Paper
-IV - Economy and Development of India and Andhra Pradesh
Paper
-V - Science, Technology and Environmental Issues
=======================
UPDATE 24-05-2023
పరీక్షల హాల్
టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు: 03.06.2023
నుండి 10.06.2023 వరకు
=======================
UDATE
19-05-2023
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అప్డేట్ ఇదే
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకి అర్హత సాధించిన
అభ్యర్ధులకు మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 వరకు
నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు వెబ్ నోట్ ను శుక్రవారం (మే 19) విడుదల చేశారు.
పరీక్ష తేదీలు: 03.06.2023 నుండి 10.06.2023 వరకు
హాల్ టికెట్ల విడుదల తేదీ: 24.05.2023
=======================
UPDATE 28-03-2023
ఏపీపీఎస్సీ
గ్రూప్ -1
మెయిన్స్ పరీక్షల కొత్త తేదీలు విడుదల
పరీక్షల కొత్త
తేదీలు: 03/06/2023 నుండి 10/06/2023 వరకు
ఏపీపీఎస్సీ
గ్రూప్ -1
మెయిన్స్ పరీక్షలు వాయిదా అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం..
ఏప్రిల్ 23
నుంచి 29వరకు ఈ పరీక్షలు
జరగాల్సి ఉండగా జూన్ తొలి వారానికి వాయిదా వేశారు. ఏప్రిల్ 24 నుంచి మే 18వరకు సివిల్స్
ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు
వెల్లడించారు.
ఏపీపీఎస్సీ
గ్రూప్-1
మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్టు
ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. మార్చి 27న యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ
తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసే 25 మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో ఉంచుకొని అధికారులు
గ్రూప్ 1
మెయిన్స్ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు చేశారు.
=======================
UPDATE 04-03-2023
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అప్డేట్ ఇదే
మెయిన్స్ పరీక్షకి
అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ క్రింది విషయాలను APPSC వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఎనేబల్ చేసే తేదీలలో అప్డేట్ చేయవలసి ఉంటుంది.
1. ప్రధాన
పరీక్ష రాసే మాధ్యమం,
2. పోస్ట్
ప్రాధాన్యత,
3. జోనల్
ప్రాధాన్యత,
4. పరీక్ష కేంద్రం
ఆన్లైన్ అప్లికేషన్
ఎనేబల్ తేదీలు: 06-03-2023 నుండి 15-03-2023
GROUP-
I SERVICES - POST PREFERENCES
=======================
UPDATE
28-01-2023
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల – మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది.
ఈ నెల 8వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష రాసిన
వారిలో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 6,455 మందిని ప్రధాన పరీక్ష రాసేందుకు ఏపీ పీఎస్సీ ఎంపిక చేసింది.
MAINS: ప్రధాన పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన
పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన
పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగిందని ఏపీపీఎస్సీ
వర్గాలు తెలిపాయి.
=======================
UPDATE 10-01-2023
ప్రారంభ 'కీ' విడుదల
=======================
UPDATE
08-01-2023
SCREENING
TEST (PRELIMS) – 08/01/2023
=======================
UPDATE 31-12-2022
పరీక్ష తేదీ: 08/01/2023
Group I Specimen copies of OMR Answer
Sheet and Question Paper Booklets 👇
=======================
UPDATE
11-11-2022
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ముందుగా ప్రకటించిన 18-12-2022 తేదీ నుండి 08-01-2023
కి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది.
WEB
NOTE ON EXAM DATE POSTPONEMENT
=======================
ఏపీలో 92 గ్రూప్-1 సర్వీసు
ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్
విడుదల చేసింది. గ్రూప్-1(జనరల్/ లిమిటెడ్ రిక్రూట్ మెంట్)
ప్రకటన నెం. 28/2022 ద్వారా 92 పోస్టులు భర్తీ కానున్నాయి.
అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్
లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. పోస్టు పేరు, శాఖ వివరాలు:
1. డిప్యూటీ కలెక్టర్ (ఏపీ సివిల్
సర్వీస్- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్): 10 పోస్టులు
2. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్
ట్యా క్స్ (ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్): 12 పోస్టులు
3. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్
పోలీస్ (సివిల్) క్యాట్-2 (ఏపీ పోలీస్ సర్వీస్): 13 పోస్టులు
4. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్
(మెన్) (ఏపీ జైల్ సర్వీస్): 02 పోస్టులు
5. డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్
ఆఫీసర్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్): 02 పోస్టులు
6. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్):
08 పోస్టులు
7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (ఏపీ
ట్రాన్స్పర్ట్ సర్వీస్): 02 పోస్టులు
8. మండల్ పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (ఏపీ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్ మెంట్): 07 పోస్టులు
9. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (ఏపీ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ సర్వీస్): 03 పోస్టులు
10. డిస్ట్రిక్ట్ టైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్): 01 పోస్టు
11. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్): 02 పోస్టులు
12. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 (మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్): 06 పోస్టులు
13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-2(ఏపీ మెడికల్ అండ్ హెల్త్
(అడ్మినిస్ట్రేషన్) సర్వీస్): 18 పోస్టులు
14. డిప్యూటీ రిజిస్టార్ (ఏపీ కోఆపరేటివ్ సర్వీస్): 01 పోస్టు
15. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్): 05 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 92
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
డివిజనల్ / డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ (ఫైర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01/07/2022 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్) ఖాళీలకు 21-30 ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండెంట్
ఆఫ్ జైల్ (మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజనల్ / డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఖాళీలకు 21-28 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 - 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (స్క్రీనింగ్), మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ ), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు (జిల్లా కేంద్రాలు):
శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, పల్నాడు, పార్వతీపురం మన్యం, బాపట్ల, అల్లూరి సీతా
రామరాజు, ప్రకాశం, విశాఖపట్నం, ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, తిరుపతి, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, అన్నమయ్య, తూర్పుగోదావరి, వై.యస్.ఆర్.కడప, పశ్చిమగోదావరి, శ్రీ సత్యసాయి, ఏలూరు, అనంతపురం, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్
జిల్లా, కర్నూలు.
ప్రధాన పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
దరఖాస్తు రుసుము: రూ.370.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్య మైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13/10/2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01/11/2022.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02/11/2022. 05/11/2022
ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్): 18/12/2022. 08/01/2023
మెయిన్స్- రాత పరీక్ష(డిస్క్రిప్టివ్): మార్చి ద్వితీయార్ధం, 2023.
WEB
NOTE ON DUE DATE EXTENSION
=======================
APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar