APPSC: Executive Officer Grade-III in
A.P.Endowments Sub-Service - Mains Test
ఏపీపీఎస్సీ: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) మెయిన్ టెస్ట్
==========================
UPDATE
12-04-2023
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్
సబ్ సర్వీస్) మెయిన్ టెస్ట్ ఫలితాలు విడుదల
ఏపీపీఎస్సీ ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ప్రకటన నం.24/2021) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏప్రిల్ 12న ప్రధాన
పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలతో పాటు తుది కీని విడుదల చేసింది. ప్రధాన
పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17న ప్రధాన కేంద్రాల్లో సీబీటీ
విధానంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారిక
ప్రకటనను విడుదల చేసింది.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను
వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏయే సర్టిఫికెట్లను
తీసుకురావాలో ఆయా వివరాలను సూచించింది. ఏ అభ్యర్థి అయినా వెరిఫికేషన్ కు హాజరుకాకపోతే, మెరిట్
జాబితాలో తదుపరి అభ్యర్థిని పిలుస్తారు.
==========================
UPDATE 22-02-2023
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్
సబ్ సర్వీస్) మెయిన్ టెస్ట్ ప్రాథమిక ‘కీ’లు విడుదల
==========================
UPDATE
10-02-2023
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) మెయిన్
టెస్ట్ హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 17/02/2023
==========================
రాష్ట్ర
దేవాదాయ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 నియామక స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అక్టోబరు 27న ప్రకటించింది. గత జులైలో జరిగిన ఈ పరీక్షను 52,915 మంది రాశారు. 60 పోస్టుల
భర్తీకి జరిగిన ఈ పరీక్ష ద్వారా ప్రధాన పరీక్షకు 1,278 మందిని ఎంపికచేశారు.
ప్రధాన
పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. త్వరలో తేదీ ప్రకటిస్తారు. ఫలితాలు వెబ్ సైట్ లో
ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు.
=====================
=====================
ఏపిపిఎస్‌సి
రిక్రూట్‌మెంట్ 2021: జూనియర్
అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III
పోస్టులు - మొత్తం 730 పోస్టులు - వివరాలు ఇవే
=====================
0 Komentar