DRDO Recruitment 2022: Notification for
1061 CEPTAM 10 Admin and Allied Posts – Details Here
డీఆర్‌డీవోలో
1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్
అసిస్టెంట్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్డీవో
ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్ మెంట్ (సెప్టమ్-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ ప్రకటన
ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్
అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది.
1. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు
4. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఎ' (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు
5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఎ'(హిందీ టైపింగ్): 12 పోస్టులు
6. స్టోర్ అసిస్టెంట్ 'ఎ'(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు
7. స్టోర్ అసిస్టెంట్ 'ఎ'(హిందీ టైపింగ్): 04 పోస్టులు
8. సెక్యూరిటీ అసిస్టెంట్ 'ఎ': 41 పోస్టులు
9. వెహికల్ ఆపరేటర్ 'ఎ': 145 పోస్టులు
10. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 'ఎ': 18 పోస్టులు
11. ఫైర్ మ్యాన్: 86 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 1061.
అర్హతలు:
పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్ పరిజ్ఞానం, డైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జేటీవో,
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు:
నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35,400-రూ.1,12,400,
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు
రూ.25,500-రూ.81,100, ఇతర పోస్టులకు రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది.
దరఖాస్తు
రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు
ఉంటుంది).
ఎంపిక
విధానం: పోస్టును అనుసరించి టైర్-1 (సీబీటీ), టైర్-2 (నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2022.
0 Komentar