HERO VIDA
V1 ELECTRIC SCOOTER LAUNCHED IN INDIA AT RS 1.45 LAKH!
హీరో మోటోకార్ప్ విద్యుత్ స్కూటర్ విడా వీ1 విడుదల – ధర మరియు ఫీచర్ల
వివరాలు ఇవే
======================
UPDATE 11-10-2022
======================
ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) విద్యుత్ వాహన రంగంలోకి అడుగు పెట్టింది. విడా వీ1 (VIDA V1) పేరిట తొలి విద్యుత్ స్కూటర్‌ను శుక్రవారం లాంచ్ చేసింది.
రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో పేరిట వీటిని విడుదల చేశారు. వీ1 ప్లస్ ధరను రూ.1.45 లక్షలుగానూ, వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ నిర్ణయించారు.
సింగిల్ ఛార్జ్ తో విడా వీ1 మోడల్ 143 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుంది. విడా ప్రో మోడల్ 165 కిలోమీటర్లు
ప్రయాణించొచ్చు. రిమూవబుల్ బ్యాటరీ, పోర్టబుల్ ఛార్జర్ తో ఈ బైక్
వస్తోంది. అక్టోబర్ 10 నుంచి ఈ స్కూటర్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో
తెలిపింది. విడా వీ1 కేవలం స్కూటర్ మాత్రమే కాదని, ఈ సెగ్మెంట్ లో ఓ పవర్ ఛేంజ్ కానుందని హీరో మోటోకార్ప్ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజాల్ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ తో పాటు ఏథర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్ బైక్ లకు విడా పోటీగా నిలవనుంది.
సంప్రదాయ ఇంధన విభాగంలో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్.. విద్యుత్ వాహన విభాగంలోనూ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్ లో రూ. 490 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ రూపొందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ కు 35 శాతం వాటా ఉంది.
Tune into the Livestream of our #VidaEV launch on Facebook https://t.co/FiUyeWC5VE or YouTube https://t.co/QWzB2k8YDe to share in the festivities with Pooja Yadav to get a sneak peek of India’s latest, most exciting #ElectricScooter 😎 🛵 pic.twitter.com/gO1Ewg0iEs
— VIDA World (@VidaDotWorld) October 7, 2022
Reservations are LIVE!🎉 #MakeWay for a better future and cleaner mobility. Visit https://t.co/FWrCkaX9wy to reserve yours now for just ₹2,499.#ElectricScooter #VidaEScooter #VidaEV pic.twitter.com/lzRL7HVh6H
— VIDA World (@VidaDotWorld) October 11, 2022
0 Komentar