Indian Navy Recruitment 2022 – Apply for
217 SSC Officer Posts – Details Here
భారత నౌకాదళంలో 217 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు - ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు
భారత
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం... షార్ట్ సర్వీస్ కమిషన్
(ఎన్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్
విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ) జూన్ 2023లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత
శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి.
అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.
బ్రాంచి/
కేడర్ వివరాలు . . .
ఎగ్జిక్యూటివ్
బ్రాంచి:
1. జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్: 56 పోస్టులు
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 05 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 15 పోస్టులు
4. పైలట్: 25 పోస్టులు
5. లాజిస్టిక్స్: 20 పోస్టులు
6. ఎడ్యుకేషన్: 12 పోస్టులు
టెక్నికల్
బ్రాంచి:
7. ఇంజినీరింగ్ బ్రాంచి (జనరల్ సర్వీస్): 25 పోస్టులు
8. ఎలక్ట్రికల్ బ్రాంచి (జనరల్ సర్వీస్): 45 పోస్టులు
9. నావల్ కన్‌స్ట్రక్టర్: 14 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 217
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ,
బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ
డిప్లొమా,
ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత
శారీరక ప్రమాణాలు ఉండాలి.
ప్రారంభ
వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర
అలవెన్సులు.
ఎంపిక
విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య
పరీక్షలు,
మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల
పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2022.
0 Komentar