The Nobel Prize
2022 for Economics Awarded to 3 US-Based Economists
ఈ ఏడాది ఆర్థిక
శాస్త్రంలో బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై
పరిశోధనలకుగానూ ముగ్గురికి నోబెల్ బహుమతి
ఈ ఏడాది
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి (Nobel prize 2022) ముగ్గురిని వరించింది. బ్యాంకులు, ఆర్థిక
సంక్షోభాల (Financial Crisis) పై పరిశోధనలకుగానూ
ప్రముఖ ఆర్థికవేత్తలు బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్
డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్. డైబ్
విగ్ కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ
ప్రకటించింది.
ఈ ముగ్గురూ
ఆర్ధిక వ్యవస్థలో, ముఖ్యంగా ఆర్థిక
సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై కీలక పరిశోధనలు జరిపారు. బ్యాంకుల పతనాన్ని
నివారించడం ఎందుకు ముఖ్యం? అనేది వారి
పరిశోధనల్లో ముఖ్యాంశం. బ్యాంకులు ఎందుకు ఉన్నాయి? ఆర్థిక సంక్షోభాల సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు
తీసుకోవాలి? బ్యాంకుల పతనాలు.. ఆర్థిక సంక్షోభాలకు
ఏ విధంగా దారితీస్తాయి? తదితర ఆధునిక
బ్యాంకింగ్ పరిశోధనలకు ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు 1980ల్లోనే పునాదులు వేశారు.
ఆర్థిక
మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను
ఎదుర్కోవడంలో వారి విశ్లేషణలు ఆచరణాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. డిపాజిట్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్ లు, బ్యాంకు రుణాల విషయంలో డైమండ్, డైబ్ విగ్
పరిశోధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేశాయి. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన
ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్లను
నివారించగల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయని నోబెల్ ప్రైజ్ కమిటీ ఛైర్మన్ టోర్
ఎల్లింగ్ సేన్ చెప్పారు.
గతేడాది సైతం
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ఇచ్చారు. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు
డేవిడ్ కార్డ్, జాషువా డి. ఆంగ్రెస్ట్, గైడో డబ్ల్యూ. ఇంటెన్స్ లకు ఈ పురస్కారం దక్కడం తెలిసిందే.
The 2022 economic sciences laureates Douglas Diamond and Philip Dybvig developed theoretical models that explain why banks exist, how their role in society makes them vulnerable to rumours about their impending collapse and how society can lessen this vulnerability.#NobelPrize pic.twitter.com/ZNbnfkgjPu
— The Nobel Prize (@NobelPrize) October 10, 2022
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 10, 2022
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig “for research on banks and financial crises.”#NobelPrize pic.twitter.com/cW0sLFh2sj
0 Komentar