Rishi Sunak set to become UK’s first
Indian-origin PM
బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
బ్రిటన్ ప్రధానిగా
తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు
బ్రిటన్
కొత్త ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ ప్రధానిగా
భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) ఎన్నికయ్యారు. ఇటీవల లిజ్ ట్రస్ (Liz | truss) రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో
టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు.
ఆయనే తమ
దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు
చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాకను వరించింది. నెలన్నర రోజుల క్రితం ఓటమిపాలైన
అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఘన విజయం సాధించారు. బ్రిటన్ పాలనా పగ్గాలు
అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
బోరిస్
జాన్సన్ నిర్ణయంతో..
కన్జర్వేటివ్
పార్టీ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్ (Rishi Sunak) కంటే వెనకబడి ఉన్నానని.. ఇటువంటి సమయంలో పోటీ నుంచి
వైదొలగడమే మేలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ భావించారు. అంతేకాకుండా బరిలోంచి
తప్పుకొంటున్నట్టు ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కీలక నేతగా ఉన్న బోరిస్ పోటీ నుంచి
వైదొలగడం,
మరో నాయకురాలు పెన్నీ మోర్లాంట్ కు అంతంత మాత్రమే మద్దతు
ఉండటంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ విజయం ఖాయమైంది.
రిషి ప్రస్థానం
సామాన్యుడిగా
మొదలైన రిషి సునాక్ తన కృషి, పట్టుదలతో బ్రిటన్
ప్రధాని స్థాయికి ఎదిగారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త తరం నాయకుడిగా పేరు
తెచ్చుకున్న ఆయన బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి చరిత్ర సృష్టించారు.
బ్రిటన్ సంక్షోభం వేళ ఆర్ధిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇంగ్లాండ్
లోని సౌథాంప్టన్ నగరంలో రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్ వీర్. భారత్ లోని పంజాబ్ లో రిషి సునాక్ తల్లిదండ్రుల
మూలాలు ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి
బ్రిటనకు వలస వచ్చారు. సునాక్ తండ్రి యశ్ వీర్ వైద్యులు కాగా.. తల్లి మెడికల్ షాప్
నిర్వహించేవారు. ఆర్థిక రంగాన్ని తన కెరియర్ గా ఎంచుకున్న ఆయన.. ఆక్స్ ఫర్డ్ లో
ఫిలాసఫీ,
ఎకనామిక్స్ అభ్యసించారు.
రిషి సునాక్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడే కావడం విశేషం. తొలిసారి రిచ్మండ్
నుంచి 2015లో ఎంపీగా ఎన్నికైన ఆయన.. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్
జాన్సన్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా నియమితులై.. ఈ ఏడాది జులై వరకు కొనసాగిన విషయం
తెలిసిందే.
Sir Graham Brady, chairman of 1922 Committee of Conservative MPs, announces Rishi Sunak as Tory leader and next prime ministerhttps://t.co/LRsb5raqCz pic.twitter.com/4RHJCIL2gD
— BBC Breaking News (@BBCBreaking) October 24, 2022
0 Komentar