Solar Eclipse 2022: All You Need to Know
About Today’s Eclipse
నేడు (అక్టోబరు
25) ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం - భారత్‌లో కనువిందు చేయనున్న
పాక్షిక గ్రహణం
ఈ ఏడాదిలో
రెండో సూర్యగ్రహణం (Second Solar Eclipse) అక్టోబరు 25న ఏర్పడుతోంది. ఈ సంవత్సరం రెండు
సూర్య,
రెండు చంద్ర గ్రహణాలు మొత్తం నాలుగు గ్రహణాలు (Eclipses) ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏప్రిల్, మే నెలలో పూర్తయిన విషయం తెలిసిందే.
అయితే,
ఈ గ్రహణాలు పదిహేను రోజుల వ్యవధిలోనే సంభవించాయి. ప్రస్తుతం
కూడా అదే విధంగా రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ రెండు గ్రహణాలు ఒకదాని తర్వాత ఒకటి
వెంటనే సంభవించడం గమనార్హం. అక్టోబరు 25న
సూర్యగ్రహణం, నవంబరు 8న కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి.
అక్టోబరు 25న ఏర్పడేది పాక్షిక సూర్య గ్రహణం (Partial Solar
Eclipse). ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం భారత్‌లో
కనువిందు చేయనుంది.
కానీ, ఇలాంటి పాక్షిక సూర్యగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే మరో పదేళ్లు
అంటే 2032 వరకూ ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అమావాస్య
రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి రావడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ
సూర్యగ్రహణం అక్టోబర్ 25న సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1.15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతోపాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని
నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది.
సూర్యగ్రహణాన్ని
నేరుగా చూడకుండా రక్షణ కల్పించే బ్లాక్ ఫిల్మ్, బ్లాక్
పాలిమార్ వంటి సాధనాలను వినియోగించాలి. చంద్రుడి ముఖం (న్యూమూన్) సూర్యుడికి
అభిముఖంగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్య కిరణాలు భూమిని
చేరుకోకుండా చంద్రుడు అడ్డు పడతాడు. భూమి, సూర్యుడి
మధ్య కక్ష్యలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చంద్రుడి నీడ
భూమిపై పడటాన్ని సూర్యగ్రహణంగా చెబుతారు.
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలో
ఉండి.. సూర్యుడి ఉపరితం కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా
ఏర్పడుతుంది. సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అనే మూడు భాగాలు ఉంటాయి. గ్రహణం ఆరంభంలో చంద్రుడు..
సూర్యుడి డిస్క్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలోని అధిక భాగాన్ని
చంద్రుడి నీడ కప్పేస్తుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్య నుంచి చంద్రుడు పక్కకు
జరుగుతాడు.
మళ్లీ
పాక్షిక సూర్యగ్రహం 2025 మార్చి 29న ఏర్పడుతున్నా భారత్‌లో దీనిని వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక
సూర్యగ్రహణం మనకు కనిపిస్తుంది. అయితే, 2027 ఆగస్టు 2 మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం
ఏర్పడుతుందని, ఇది దేశవ్యాప్తంగా దర్శనమిస్తుందని
ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏడాదికి నాలుగు నుంచి ఆరు గ్రహణాలు ఏర్పడతాయి.
0 Komentar