The Nobel Prize 2022: This Year the
Nobel Prize in Chemistry Awarded to These 3 Scientists
ఈ ఏడాది రసాయన
శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
ఈ ఏడాది
రసాయన శాస్త్రంలో (Chemistry) విశేష పరిశోధనలు
జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి (Nobel Prize 2022) లభించింది. క్లిక్ కెమిస్ట్రీతోపాటు బయోఆర్డోగోనల్
కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టెన్ మెల్డల్ , కే బ్యారీ
షార్ప్ లెస్ లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్
అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
విశేషమేంటంటే.. ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైనన జాబితాలో ఉన్న బ్యారీ షార్ప్ లెస్.. రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న ఐదో వ్యక్తిగా ఘనత సాధించనున్నారు. 2001లో బ్యారీ షార్ప్ లెస్ ఒకసారి నోబెల్ పురస్కారం పొందగా ఈ ఏడాది రెండోది అందుకోనున్నారు. ఇప్పటివరకు నోబెల్ బహుమతులను జాన్ బర్డీన్, మేరీ సోదోవ్ స్కా క్యూరీ, లైనస్ పాలింగ్, ఫ్రెడెరిక్ సాంగలు రెండుసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.
గతేడాది
రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా
నిలిచారు. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్ అభివృద్ధి
చేసినందుకు గాను 2021లో బెంజిమిన్ లిస్ట్, డేవిడ్ మెక్ మిలన్ కు ఈ అవార్డు దక్కింది. రసాయన
శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని
సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది.
ఇప్పటివరకు
వైద్య విభాగంతోపాటు భౌతిక, రసాయనశాస్త్రాలలో
నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థిక రంగం, సాహిత్యం , శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను
వెల్లడించాల్సి ఉంది. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల
డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
The 2022 #NobelPrize laureates in chemistry Barry Sharpless and Morten Meldal have laid the foundation for a functional form of chemistry – click chemistry – in which molecular building blocks snap together quickly and efficiently. pic.twitter.com/uHCEQI59Zv
— The Nobel Prize (@NobelPrize) October 5, 2022
0 Komentar