The Nobel Prize 2022: Sweden’s Svante
Paabo wins Nobel Prize in Medicine
ఈ ఏడాది వైద్యశాస్త్రంలో
స్వీడన్ కు చెందిన స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి
వైద్యశాస్త్రంలో
విశేష కృషి చేసినందుకుగానూ స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్
పురస్కారం -2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు
అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోకు ఈ బహుమతి
దక్కింది. స్వీడన్ లోని స్టార్ హోంలో ఉన్న కరోలిన్స్క ఇన్స్టిట్యూట్లోని నోబెల్
బృందం దీనిని ప్రకటించింది. గతేడాది మాత్రం ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్
జూలియస్,
అర్జెమ్ పటాపౌటియన్లు సంయుక్తంగా నోబెల్ బహుమతి
అందుకున్నారు.
వైద్యవిభాగంతో
మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం
రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 10న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను
వెల్లడిస్తారు.
నోబెల్
బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్
క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు
అందజేస్తారు. స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా
ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న
సంగతి తెలిసిందే. 1896లో ఆల్ ఫ్రెడ్
నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన
ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
Say good morning to our new medicine laureate Svante Pääbo!
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
Pääbo received the news while enjoying a cup of coffee. After the shock wore off, one of the first things he wondered was if he could share the news with his wife, Linda.
Photo: Linda Vigilant pic.twitter.com/l27hnzojaL
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
The 2022 #NobelPrize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/fGFYYnCO6J
0 Komentar