The Nobel Prize
2022: This Year the Nobel Prize in Physics Awarded to These 3 Scientists
ఈ ఏడాది భౌతికశాస్త్రంలో
ముగ్గురికి నోబెల్ బహుమతి
భౌతికశాస్త్రంలో
నోబెల్ బహుమతి (Nobel Prize 2022) ముగ్గురిని
వరించింది. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్
జైలింగర్ లకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం దక్కింది. స్టాక్ హోంలోని రాయల్
స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ
ప్రతిష్టాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది.
గతేడాది కూడా
భౌతికశాస్త్రంలో (Physics) ఈ అవార్డును
ముగ్గురు శాస్త్రవేత్తలు ఎంపిక కావడం విశేషం. సుకురో మనాబే, క్లాస్ హాసిల్ మన్, జార్జియో
పారిసీలు సంయుక్తంగా ఈ బహుమతి అందుకున్నారు. అయితే జార్జియో పారిసీకి సగం
పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్ హాసిల్ మన్ పంచుకున్నారు. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల పై విశ్లేషణలకుగానూ
గతేడాది వీరికి నోబెల్ వరించింది.
ఇప్పటికే
వైద్య,
భౌతికశాస్త్రాలలో ఈ అవార్డులను ప్రకటించగా.. బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు.
శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేత పేరును వెల్లడిస్తారు. నోబెల్
బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్
క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు
అందజేస్తారు.
The 2022 #NobelPrize laureates in physics have conducted groundbreaking experiments using entangled quantum states, where two particles behave like a single unit even when they are separated. The results have cleared the way for new technology based upon quantum information. pic.twitter.com/vPt3rxqaqR
— The Nobel Prize (@NobelPrize) October 4, 2022
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 4, 2022
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ
0 Komentar