AP High Court Recruitment 2022: All the
Details for 3673 Posts
ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
=========================
UPDATE
13-07-2023
ఏపీ లోని జిల్లా కోర్టు ఉద్యోగాల ఎంపికకు సంబధించి
ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఏపీలోని జిల్లా
కోర్టుల్లో గతేడాది 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం
తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత
పరీక్ష ఫలితాలు మార్చిలో వెల్లడయ్యాయి. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్ధులు
ఇప్పటికే విధుల్లో చేరగా మిగిలిన ఖాళీల భర్తీ నేపథ్యంలో తాజాగా రెండో ఎంపిక జాబితా
వెల్లడైంది. నియామకాల్లో భాగంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాథమికంగా
ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జులై 17 నుంచి 31 వరకు జరుగనుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో
ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక
పత్రాలు అందజేస్తారు.
వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా 👇
=========================
UPDATE
14-05-2023
జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల
జాబితా విడుదల
ఏపీ లోని జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న వెల్లడి
కాగా ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 29న నైపుణ్య పరీక్షను నిర్వహించారు.
రాత, నైపుణ్య పరీక్షల్లో సాధించిన మార్కుల జాబితాను అనుసరించి స్టెనో ఉద్యోగాలకు
ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు తాజాగా విడుదల చేసింది. ఎంపికైన
అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మే 19న నిర్వహించనున్నారు. అనంతరం
నియామక ఉత్తర్వులు అందిస్తారు.
=========================
UPDATE 29-03-2023
జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీ
కొరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల
విభాగాల వారీగా ఎంపికైన అభ్యర్థుల
జాబితా ఇదే
ఏపీ లోని
జిల్లా కోర్టుల్లో 3,546 నియామకాలకు
సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న
వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి
2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు
సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన
విషయం తెలిసిందే. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో
ఉంచారు.
ఈ ఉద్యోగ
ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్
అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన
అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు
పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్
పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.
=========================
NON-TECHNICAL 👇
TECHNICAL 👇
=========================
UPDATE
17-03-2023
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల
భర్తీకి సంబంధించి తుది ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. రాత, నైపుణ్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్ సైట్లో
ఉంచారు. హైకోర్టులో టైపిస్ట్- 16, కాపీయిస్ట్ - 20, డ్రైవర్- 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గతేడాది
అక్టోబర్లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్
ఫిటెనెస్ సర్టిఫికెట్తో పాటు తదితర ధ్రువపత్రాలను మార్చి 31న
అందజేయాల్సి ఉంటుంది.
CLICK
FOR SELECTED LIST FOR POST OF DRIVER
CLICK
FOR SELECTED LIST FOR POST OF TYPIST / COPYIST
=========================
UPDATE
24-02-2023
హైకోర్ట్ లో ఖాళీల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు
విడుదల - ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ఇదే
=========================
UPDATE 14-01-2023
High Court Jobs:
హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు
విడుదల
పరీక్ష తేదీ: 20/01/2023
=========================
UPDATE 16-12-2022
District Court Jobs:
జిల్లా కోర్టులో
ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు: 21/12/2022 నుండి 02/01/2023
=======================
High Court Jobs:
హైకోర్టులో
ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీని ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్
(అడ్మినిస్ట్రేషన్) ఎ.గిరిధర్ డిసెంబర్ 16న ఉత్తర్వులు
జారీచేశారు. హైకోర్టులో 241 ఉద్యోగాల భర్తీకి 2023 జనవరి 20న కంప్యూటర్ ఆధారిత
పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సెక్షన్ ఆఫీసర్
/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ / ఆఫీసు
సబార్డినేట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, ఓవర్సీర్ /
అసిస్టెంట్ ఓవర్సీర్, టైపిస్ట్, కాపీయిస్టు పోస్టులకు (కామన్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు.
జనవరి 14
నుంచి హైకోర్టు అధికారిక వెబ్సైసైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జనవరి 23న లేదా అంతకుముందు ప్రశ్నపత్రాల సమాధాన 'కీ'ని అందుబాటులో ఉంచుతారు.
ప్రొవిజనల్ ఎంపిక జాబితాను ఫిబ్రవరి 13న లేదా
అంతకుముందు ప్రకటిస్తారు. టైపిస్టు, కాపీయిస్టు, డ్రైవర్ ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారి జాబితాను
మార్చి 3న ప్రకటిస్తారు.
పరీక్ష తేదీ:
20/01/2023
EXAMINATIONS AND RESULTS SCHEDULE
=======================
=======================
UPDATE 24-11-2022
ఏపీ జిల్లా
కోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీల్ని
వెల్లడిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్. కమలాకరరెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.
> స్టెనోగ్రాఫర్
గ్రేడ్-3 / జూనియర్ అసిస్టెంట్ / టైపిస్టు /
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబరు 21న మూడు విడతలు, 22న మూడు, 23న ఒక విడత, 29న రెండు విడతలు, జనవరి 2న మూడు విడతల్లో పరీక్ష ఉంటుంది.
> కాపీయిస్టు / ఎగ్జామినర్/
రికార్డు అసిస్టెంట్ పోస్టులకు డిసెంబరు 26న రెండు విడతల్లో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు.
> డ్రైవర్
/ ప్రాసెస్ సర్వర్ / ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు డిసెంబరు 26న ఒక విడత, 27న మూడు, 28న మూడు విడతలు, 29న ఒకవిడతలో ఉమ్మడి పరీక్ష ఉంటుంది.
> డిసెంబరు
16
నుంచి హైకోర్టు, జిల్లా
న్యాయస్థానాల అధికారిక వెబ్సైట్ హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి.
=========================
అమరావతిలోని
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ
హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్ ద్వారా 3673 పోస్టులను భర్తీ
చేయనున్నారు. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్
అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత
పరీక్షతో పాటు తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీల
సంఖ్య: 3673
అర్హతలు:
పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్ / స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డైవింగ్
లైసెన్స్ ఉండాలి.
వయో పరిమితి:
01/07/2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ఖాళీలను అనుసరించి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.
దరఖాస్తు
రుసుం: రూ:800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).
ఎంపిక
విధానం: పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్
టెస్ట్,
ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్
దరఖాస్తు తేదీలు:
హైకోర్టు ఖాళీలకు: 04.11.2022 నుంచి 21-11-2022 వరకు
జిల్లా కోర్టు ఖాళీలకు: 22-10-2022 నుంచి 11-11-2022 వరకు.
====================
ప్రకటనల
వారీగా ఖాళీల వివరాలు. 👇
====================
జిల్లా కోర్టు ఖాళీల వివరాలు 👇
====================
1. జూనియర్
అసిస్టెంట్: 681 పోస్టులు
====================
2. టైపిస్ట్: 170 పోస్టులు
====================
3. ఫీల్డ్
అసిస్టెంట్: 158 పోస్టులు
====================
4. ఎగ్జామినర్: 112 పోస్టులు
====================
5. కాపిస్ట్: 209 పోస్టులు
====================
6. రికార్డ్
అసిస్టెంట్: 09 పోస్టులు
====================
7. డ్రైవర్ (లైట్
వెహికల్): 20 పోస్టులు
====================
8. ప్రాసెస్
సర్వర్: 439 పోస్టులు
====================
9. ఆఫీస్
సబార్డినేట్: 1520 పోస్టులు
====================
10. స్టెనోగ్రాఫర్
గ్రేడ్-3:
114 పోస్టులు
====================
హైకోర్టు ఖాళీల వివరాలు 👇
====================
1. సెక్షన్
ఆఫీసర్ / కోర్ట్ ఆఫీసర్ / స్క్రూటినీ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు
====================
2. అసిస్టెంట్
సెక్షన్ ఆఫీసర్: 13 పోస్టులు
====================
3. కంప్యూటర్
ఆపరేటర్: 11 పోస్టులు
====================
4. ఓవర్సీర్: 01 పోస్టు
====================
5. అసిస్టెంట్
ఎగ్జామినర్: 27 పోస్టులు
====================
6. అసిస్టెంట్
ఓవర్సీర్: 01
====================
7. పోస్టు
డ్రైవర్: 08 పోస్టులు
====================
8. ఆఫీస్
సబార్డినేట్: 135 పోస్టులు
====================
9. టైపిస్ట్ & కాపిస్ట్: 36 పోస్టులు
====================
0 Komentar