EPFO Relaxes Withdrawal Norms For EPS-95
Subscribers
'ఉద్యోగుల
పింఛన్ పథకం 1995’ (EPS-95) నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు అనుమతి – ఈపీఎఫ్ఓ నిభందనల సడలింపు
6 నెలల కంటే
తక్కువ సర్వీసు మాత్రమే మిగిలిఉన్న ఖాతాదారులను తమ 'ఉద్యోగుల పింఛన్ పథకం 1995' (ఈపీఎస్-95) నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఉద్యోగుల
భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం 6 నెలల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉన్నవారు తమ భవిష్య నిధి
(పీఎఫ్) ఖాతా నుంచి మాత్రమే డబ్బులు వెనక్కి తీసుకోవడానికి అనుమతులున్నాయి. ఈపీఎస్
ఖాతాదారులకూ ఈ వెసులుబాటు ఇవ్వాలని సోమవారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్
ఆధ్వర్యంలో జరిగిన ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్
ట్రస్టీస్(సీబీటీ) 282వ సమావేశం సిఫారసు
చేసినట్లు కార్మికశాఖ వెల్లడించింది.
34 ఏళ్ల కంటే ఎక్కువ కాలంపాటు పథకంలో ఉన్నవారికి అందుకు తగ్గట్లుగా పింఛన్ ప్రయోజనాలను ఇవ్వడానికీ బోర్డు సిఫారసు చేసింది. దీనివల్ల పదవీ విరమణ ప్రయోజనాలను నిర్ణయించే సమయంలో అధిక పింఛన్ పొందడానికి వీలవుతుంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) యూనిట్లలో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునే రిడషన్ పాలసీకి సైతం అనుమతినిచ్చారు. ప్రపంచస్థాయి సామాజిక భద్రత అందించేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకునేందుకు వీలు కల్పించే కీలక వ్యూహాలు, చర్యల పైనా బోర్డు చర్చలు చేపట్టినట్లు కార్మికశాఖ పేర్కొంది."
0 Komentar