IBPS Recruitment 2022: All the Details for 710 Specialist
Officer Posts
ప్రభుత్వ
బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE
02-04-2023
మెయిన్స్ & ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాలు
విడుదల
ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ (సీఆర్పీ
ఎస్వో XII- 2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల
చేసింది. దేశవ్యాప్తంగా గతేడాది డిసెంబర్ లో
ప్రిలిమ్స్, ఈ ఏడాది జనవరిలో మెయిన్స్ పరీక్షలను ఐబీపీఎస్
నిర్వహించింది. ఇంటర్వ్యూ అనంతరం ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన
అభ్యర్ధులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన
లింక్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
=======================
UPDATE
17-01-2023
ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్
ఆఫీసర్ (సీఆర్పీ ఎస్ వో XII- 2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి
ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్
సెలెక్షన్(ఐబీపీఎస్) జనవరి 17న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా
ఎస్ వో నియామక ప్రాథమిక పరీక్షలను డిసెంబర్ 24, 31 తేదీల్లో
నిర్వహించింది.
ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన
అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన
లింక్ జనవరి 25 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన
అభ్యర్థులు మెయిన్స్ కు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది.
=======================
ఇన్స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) . . . వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్పీ ఎస్పీఎల్ XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత - ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నవంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
రిక్రూట్
మెంట్ లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్
బ్యాంక్,
యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్
ఇండియా,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్
ఇండియా,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్
బ్యాంక్,
పంజాబ్ & సింధ్ బ్యాంక్.
1. ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 44 పోస్టులు
2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 516 పోస్టులు
3. రాజ్ భాష అధికారి (స్కేల్-1): 25 పోస్టులు
4. లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు
5. హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 15 పోస్టులు
6. మార్కెటింగ్ ఆఫీసర్ ( స్కేల్-1): 100 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 710
అర్హతలు:
పోస్టును అనుసరించి బీఈ, బీటెక్ (కంప్యూటర్
సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ /
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్
/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /
ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్).
డిగ్రీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్ / యానిమల్ హస్బెండరీ / వెటర్నరీ సైన్స్ /
డెయిరీ సైన్స్ / ఫిషరీ సైన్స్ / పిసికల్చర్ / అగ్రి. మార్కెటింగ్ & కోఆపరేషన్ / కో-ఆపరేషన్ & బ్యాంకింగ్ / ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ / అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ /
ఫుడ్ సైన్స్ / అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్ మెంట్ / డెయిరీ టెక్నాలజీ /
అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ / సెరికల్చర్). పీజీ (ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ / కంప్యూటర్ అప్లికేషన్స్). పీజీ (హిందీ / సంస్కృతం). డిగ్రీ (ఎల్ ఎల్
బీ),
పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్ మెంట్ / ఇండస్ట్రియల్
రిలేషన్స్ / హెచ్ఆర్ / హెచ్ ఆర్ డీ / సోషల్ వర్క్, లేబర్ లా). ఎంఎంఎస్ (మార్కెటింగ్) / ఎంబీఏ (మార్కెటింగ్) / పీజీడీబీఏ /
పీజీడీబీఎం / పీజీపీఎం / పీజీడీఎం.
వయోపరిమితి: 01.11.2022 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , వరంగల్.
ముఖ్య మైన
తేదీలు…
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2022
ఆన్ లైన్
దరఖాస్తుకు చివరితేది: 21.11.2022.
అడ్మిట్
కార్డు డౌన్లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022.
ఆన్లైన్
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 24.12.2022, 31.12.2022.
ఆన్లైన్
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2023.
ఆన్లైన్
మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి, 2023.
ఆన్ లైన్
మెయిన్ పరీక్ష తేదీ: 29.01.2023.
తుది పరీక్ష
ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2023.
ఇంటర్వ్యూ
కాల్ లెటర్ డౌన్లోడ్: ఫిబ్రవరి, 2023.
ఇంటర్వ్యూ
నిర్వహణ: ఫిబ్రవరి / మార్చి, 2023.
ప్రొవిజినల్
అలాట్ మెంట్: ఏప్రిల్, 2023.
=======================
=======================
0 Komentar