Lunar Eclipse 2022 (Nov 08): All You Need to Know
About Today’s Eclipse
నేడు (నవంబర్
08)
సుదీర్ఘమైన సంపూర్ణ చంద్ర గ్రహణం – వివరాలు ఇవే
ఈ ఏడాదిలో
రెండో చంద్ర గ్రహణం (Second Lunar Eclipse) నవంబర్ 08న ఏర్పడుతోంది. ఈ సంవత్సరం రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు మొత్తం నాలుగు గ్రహణాలు (Eclipses) ఏర్పడ్డాయి. ఈ గ్రహణాలు
పదిహేను రోజుల వ్యవధిలోనే సంభవించాయి. ప్రస్తుతం కూడా అదే విధంగా రెండు వారాల
వ్యవధిలోనే మళ్లీ రెండు గ్రహణాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే సంభవించడం గమనార్హం.
అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న కార్తీక పౌర్ణమి
రోజున చంద్రగ్రహణం ఏర్పడ్డాయి.
ఈ
చంద్రగ్రహణం నవంబరు 8న వివిధ ప్రాంతాల్లో స్థానిక
కాలమానం ప్రకారం కనువిందు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు వరకూ కొనసాగుతోంది. భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకూ 45 నిమిషాల 48 సెకెన్లు దర్శనమివ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
గ్రహణం
ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.46 గంటలకు చంద్రుడు
పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది. ఇలా 5.11 గంటల వరకూ సాగుతుంది. అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి
కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:19 గంటలకు గ్రహణం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని అన్ని
ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా
కోల్‌కతాలో సంపూర్ణ చంద్ర గ్రహణం పూర్తి స్థాయిలో వీక్షించవచ్చు.
సుదీర్ఘకాల
చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తరువాత ఇదే
మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక, చంద్రగ్రహణాన్ని
నేరుగా చూడొచ్చని, ఎటువంటి పరికరాలు
అవసరం లేదని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన
చంద్రుడ్ని చూడొచ్చు.
CLICK FOR
MORE DETAILS ABOUT LUNAR ECLIPSE
CLICK FOR MORE DETAILS ABOUT 2022 ECLIPSES
A total lunar eclipse – sometimes called a #BloodMoon – is set to peak Tuesday, Nov. 8 at 5:17am ET (1017 UTC). It's the last one until 2025.
— NASA (@NASA) November 7, 2022
Find out if you’re in an eclipse viewing area or watch it live with @NASAMoon experts: https://t.co/wm937tJHVe pic.twitter.com/CIOwcjyb6p
0 Komentar