N Jagadeesan Create World Record with 277
Runs in List A Cricket
క్రికెటర్ జగదీశన్
ప్రపంచ రికార్డు – తమిళనాడు జట్టు 50 ఓవర్లకు
506 పరుగులు
యువ
క్రికెటర్ నారాయణ్ జగదీశన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. లిస్ట్ - A మ్యాచ్ లో అత్యధిక
వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా అవతరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా
అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్
లో జగదీశన్ 277 (141 బంతుల్లో) పరుగులు సాధించాడు. ఇందులో 25 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి.
దీంతో సర్రే ఆటగాడు ఏడీ బ్రౌన్ చేసిన 268 పరుగుల రికార్డును అధిగమించాడు. 2002లో జరిగిన కౌంటీ క్రికెట్ గ్లామోర్గన్పై బ్రౌన్ 268 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బ్రౌన్ రికార్డుతోపాటు
టీస్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) రికార్డూ బద్దలు కావడం విశేషం.
చినస్వామి
స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో అరుణాచల్పై మరో ఓపెనింగ్ బ్యాటర్ సాయి సుదర్శన్
(154)తో కలిసి జగదీశన్ తొలి వికెట్కు 416 పరుగులను జోడించాడు. ఇదే క్రమంలో వరుసగా ఐదు సెంచరీలు
సాధించిన బ్యాటర్గానూ రికార్డు సృష్టించాడు. గత ఐదు మ్యాచుల్లో హరియాణాపై 128, గోవాపై 168, ఛత్తీస్గడ్ పై 107, ఆంధ్రప్రదేశ్ పై 114, అరుణాచల్ ప్రదేశ్ పై 277 పరుగులు సాధించాడు.
తమిళనాడు
రికార్డు
లిస్ట్ - ఏ
క్రికెట్లో 500కి పైగా పరుగులు చేసిన జట్టుగా
తమిళనాడు అవతరించింది. అరుణాచల్ ప్రదేశ్ పై
తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు జగదీశన్ (277), సుదర్శన్ (154) రాణించడంతో 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 506/2 స్కోరు చేసింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పేరిట ఈ రికార్డు
ఉండేది. నెదర్లాండ్స్ పై 498 పరుగులు చేసింది.
రికార్డు విజయం
ప్రపంచ
రికార్డ్ బద్దలు విజయ్ హాజారే ట్రోఫీలో 506 రన్స్ చేసిన తమిళనాడు.. అరుణాచల్ ప్రదేశ్ను 71 పరుగులకే ఆలౌట్ చేసింది. తమిళనాడు బౌలర్లలో సిద్ధార్థ్ 5 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆ జట్టు 435 రన్స్ తేడాతో గెలిచింది. ప్రపంచంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో
అత్యధిక రన్స్ తేడాతో గెలిచిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. 2వ ప్లేస్ లో సోమర్ సెట్ (346 రన్స్) ఉంది.
0 Komentar