PAYTM Users Can Now Make UPI Payments to
Mobiles with Other UPI Apps
పేటీఎం లో కొత్త
ఫీచర్ - మొబైల్ నంబర్ ఆధారంగా ఇతర యూపీఐ యాప్స్ కు డబ్బులు పంపించే సదుపాయం
UPI ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయాలంటే అవతలి వ్యక్తి యూపీఐ ఐడీ మనకు తెలిసి
ఉండాలి. ఒకవేళ ఫోన్ నంబర్ ఆధారంగా డబ్బులు పంపించాలంటే అదే యాప్ ను మనమూ
వాడుతుండాలి. ఒకరి వద్ద ఉన్న యాప్ వేరే వారి వద్ద లేనప్పుడు; ఇద్దరూ ఒకే యాప్ ని వాడని సందర్భంలో పేమెంట్స్ చేయడం వీలు
పడదు.
మొబైల్ నంబర్
ఆధారంగా ఇతర యూపీఐ యాప్స్ కు డబ్బులు పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి
తెచ్చినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటించింది. సదరు వ్యక్తి
పేటీఎంలో రిజిస్టర్ అవ్వకపోయినా పేమెంట్ చేయడం సాధ్యమేనని పేర్కొంది.
యూపీఐ
పేమెంట్స్ కు సంబంధించి తమ యూనివర్సల్
డేటాను పరస్పరం పంచుకోవాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సర్వీసు ప్రొవైడర్లకు సూచించింది. దీనివల్ల ఏ యాప్
వినియోగదారులైనా ఇతర యూపీఐ యాప్ కలిగిన వ్యక్తులకు లావాదేవీలు చేయొచ్చు. ఫలానా
యూపీఐ యాప్ ద్వారానే పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే పేటీఎం తాజా ఈ
సదుపాయాన్ని తీసుకొచ్చింది.
ఈ సేవలను
పొందాలంటే పేటీఎం యాప్ లోని యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ సెక్షన్ కు వెళితే 'టు యూపీఐ
యాప్స్'
అనే సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏ
యూపీఐ యాప్ కు అయిన చెల్లింపులు చేయొచ్చు.
0 Komentar