TS: తెలంగాణలో
9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ
రాష్ట్రం లో
గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ
చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. టీఎస్ పీఎస్సీ ద్వారా గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్ 4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్
పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆర్థికశాఖలో 191, పురపాలకశాఖలో 238 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు..
వ్యవసాయశాఖలో 44, బీసీ సంక్షేమశాఖలో 307, పౌరసరఫరాల శాఖలో 72 ఉన్నాయి.
అటవీశాఖలో 23, ఆర్థికశాఖలో 46, వైద్య- ఆరోగ్యశాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 జూనియర్ అసిస్టెంట్
పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.
హోంశాఖలో 133, నీటిపారుదల శాఖలో 51, కార్మికశాఖలో 128, మైనార్టీ
సంక్షేమశాఖలో 191 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.
పురపాలక శాఖలో 601, పంచాయతీరాజ్ శాఖలో 1,245, రెవెన్యూశాఖలో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖలో 474 జూనియర్ అసిస్టెంట్
పోస్టులకు అనుమతి ఇచ్చారు. సెకండరీ విద్యాశాఖలో 97, రవాణాశాఖలో 20, గిరిజన సంక్షేమ శాఖలో
221,
మహిళా, శిశు సంక్షేమ శాఖలో 18, యువజన సర్వీసుల శాఖలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
Big announcement!
— Harish Rao Thanneeru (@trsharish) November 25, 2022
9,168 Group-IV vacancies be filled by Direct Recruitment through TSPSC#Telangana Govt under #CMKCR Garu, the leader who is serving & fulfilling the promises & wishes, accorded Permission for filling-up of such huge number of posts.
Best wishes to aspirants. pic.twitter.com/4YBgHRAp0q
0 Komentar