Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS GOVT: గ్రూప్-2,3,4 లో మరికొన్ని రకాల పోస్టులు – వివరాలు ఇవే

 

TS GOVT: గ్రూప్-2,3,4 లో మరికొన్ని రకాల పోస్టులు వివరాలు ఇవే

తెలంగాణలో గ్రూప్-2, 3, 4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది.

గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్-3లో మరో రెండు, గ్రూప్-4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది.

> గ్రూప్-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉంటాయి.

> గ్రూప్-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, HODల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చారు.

> గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags