WhatsApp Community
vs Groups: The Difference Between Communities and Groups – Explained Here
వాట్సాప్
కమ్యూనిటీస్ మరియు గ్రూప్స్ మధ్య ఉన్న తేడా ఇదే
వాట్సాప్
ఇటీవల కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు 20 గ్రూపులను ఒకే చోటుకి తీసుకురావచ్చు. ఆఫీస్ లేదా హౌసింగ్
సొసైటీల్లో చాలా మంది తమ పరిచయస్తులు, సహోద్యోగులతో
కలిసి గ్రూపులను నిర్వహిస్తుంటారు. అలాంటి వాటన్నింటినీ ఒక వేదిక పైకి
తీసుకొచ్చేందుకు కమ్యూనిటీస్ ను డెవలప్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్
విడుదలైన తర్వాత చాలా మంది యూజర్లు గ్రూప్స్ తో కమ్యూనిటీసను పోలుస్తూ..
రెండింటికి మధ్య వ్యత్యాసం గురించి చెప్పాలని ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాట్సాప్ కమ్యూనిటీస్, గ్రూప్స్
మధ్య ఉన్న తేడాను వివరిస్తూ వీడియోను విడుదల చేసింది.
గ్రూప్స్ (Groups)
స్నేహితులు, కుటుంబసభ్యులు, ఆఫీలో
సహోద్యోగులతో మెసేజ్, ఆడియో / వీడియోలు
షేర్ చేసేందుకు, ఒకేసారి ఎక్కువమందితో చాట్ చేసేందుకు
గ్రూప్స్ ఉపయోగపడుతుంది. ఇందులో 1024 మంది సభ్యులుగా
ఉండొచ్చు. గ్రూప్ సంభాషణలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుంది. ఇందులో
ఎవరైనా ఇన్వైట్ లింక్, క్యూ ఆర్ కోడ్
స్కాన్ లేదా అడ్మిన్ అనుమతితో గ్రూప్లో సభ్యులుగా చేరొచ్చు.
కమ్యూనిటీస్
(Communities)
స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్ వంటి
ప్రదేశాల్లో సెక్షన్లు, బ్లాక్ ల వారీగా
గ్రూప్లను క్రియేట్ చేస్తారు. వాటిలో ఏదైనా సమాచారం షేర్ చేసుకోవాలంటే ప్రతి
గ్రూపును సెలెక్ట్ చేసి ఫార్వార్డ్ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీసను
పరిచయం చేశారు.
20 గ్రూలను ఒకేసారి కమ్యూనిటీలోకి తీసుకురావచ్చు. దీంతో కమ్యూనిటీస్ అడ్మిన్
ఏదైనా సమాచారాన్ని షేర్ చేస్తే 20 గ్రూప్లో ఉన్న
సభ్యులందరికీ తెలుస్తుంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా
షేర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వాట్సాప్ తెలిపింది. గ్రూప్స్ తరహాలోనే ఇందులో
కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుంది. దాంతోపాటు ఒక గ్రూప్ లోని సభ్యులు
మరొక గ్రూప్ సభ్యులతో సంభాషించాలా? వద్దా? అనేది కూడా కమ్యూనిటీస్ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Welcome to Communities 👋
— WhatsApp (@WhatsApp) November 3, 2022
Now admins can bring related groups together in one place to keep conversations organized.
Organized. Private. Connected 🤝 pic.twitter.com/u7ZSmrs7Ys
The difference between Communities and groups, explained 👇 pic.twitter.com/86MbKtY9Nv
— WhatsApp (@WhatsApp) November 10, 2022
0 Komentar