AP - Facial Recognition-Based
Attendance System to All the Employees of All Levels, Across the State
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇకపై ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి
GAD - PU - Attendance
by Photography (Facial Recognition Based Attendance System) - Implementation of
Attendance by Photography (FRBAS) to al! the employees of all levels, across
the State – Orders - Issued.
GENERAL
ADMINISTRATION (PU-B) DEPARTMENT
G.O.Ms.No.159, Dated:26-12-2022
రాష్ట్ర
సచివాలయం నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు... ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ
గుర్తింపు ఆధారిత (ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్) హాజరు విధానాన్ని రాష్ట్ర
ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తిగల
ప్రభుత్వ సంస్థలు, జిల్లా కలెక్టరేట్‌లు, అన్ని ప్రాంతీయ, డివిజినల్, జిల్లా కార్యాలయాలు, స్థానిక
సంస్థలు,
మండల, గ్రామస్థాయి
కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నిటికీ దీన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కె.ఎస్.జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర
సచివాలయం,
విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా స్థాయి కార్యాలయాల్లో వచ్చే జనవరి 1 వ తేదీ
నుంచి, మిగతా కార్యాలయాల సిబ్బందికి జనవరి 16 నుంచి ఈ విధానం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
0 Komentar