AP BIE:
Intermediate Examinations-2023: All the Details Here
ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023: పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 12-07-2023
ఇంటర్
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల 'రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్' ఫలితాలు విడుదల
====================
UPDATE 13-06-2003
ఇంటర్
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏపీ
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 39.6% మంది ఉత్తీర్ణులయ్యారు. గత
మార్చిలో అనుత్తీర్ణులైన వారిలో 2,51,653 మంది పరీక్ష రాయగా..99,698 మంది
ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 37.77% మంది ఉత్తీర్ణులు కాగా..
ద్వితీయ సంవత్సరంలో 42.36% మంది పాస్ అయ్యారు. మొదటి ఏడాది మార్కుల
మెరుగు(ఇంప్రూవ్మెంట్)కు 1,69,347 పరీక్షలు రాయగా.. ఇందులో 1,41,733 (83%) మందికి
మార్కులు పెరిగాయి. గతంలో అనుత్తీర్ణులై ఇప్పుడు రెండో ఏడాది పరీక్ష రాసిన వారిలో
37.22% మంది పాస్ అయ్యారు.
ఇంటర్మీడియట్
పరీక్ష ఫలితాలను మంగళవారం (జూన్ 13) ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శేషగిరి బాబు
విడుదల చేశారు. గత మార్చి, అడ్వాన్స్డ్
సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి మొదటి ఏడాదిలో బాలురు 74.34%, బాలికలు
80.56%, రెండో ఏడాదిలో బాలురు 81.99%, బాలికలు
86.46% మంది ఉత్తీర్ణ సాధించారు. మొదటి ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా
మొదటిస్థానంలో నిలవగా.. వైయస్ఆర్ జిల్లా అట్టడుగున నిలిచింది. రెండో ఏడాదిలో
పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. వైయస్ఆర్ చివరి స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా శేషగిరి బాబు మాట్లాడుతూ.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24
నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించగా.. కేవలం 12 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని
తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్, స్కానింగ్ కాపీతోపాటు
రీవెరిఫికేషన్ కు జూన్ 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
======================
RESULTS LINKS 👇👇👇
======================
INTER 1ST YEAR (GENERAL) RESULTS LINKS
======================
INTER 1ST YEAR (VOCATION) RESULTS LINKS
======================
INTER 2ND YEAR (GENERAL) RESULTS LINKS
======================
INTER 2ND YEAR (VOCATION) RESULTS LINKS
======================
UPDATE 13-06-2023
ఇంటర్ అడ్వాన్స్డ్
సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల అప్డేట్ ఇదే
ఆంధ్ర ప్రదేశ్
లోని ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంగళవారం (జూన్ 13న) సాయంత్రం 5గంటలకు అధికారులు
విడుదల చేయనున్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు
మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసింది. ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ
శేషగిరిబాబు విడుదల చేస్తారు.
====================
UPDATE 22-05-2023
సప్లిమెంటరీ
పరీక్షల హాల్ టికెట్లు విడుదల
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 24/05/2023 నుంచి 01/06/2023 వరకు
====================
UPDATE
16-05-2023
రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్ & రీకౌంటింగ్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. బోర్డు వెబ్సైట్లో రోల్ నంబరు, పుట్టినతేదీ, రశీదు నంబరు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.
రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జవాబు పత్రాలను డౌన్లోడ్
చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే టోల్ నంబరు 18004257635లో సంప్రదించాలన్నారు.
====================
UPDATE 30-04-2023
Memorandum of Marks
====================
UPDATE 29-04-2023
BIE AP IPE MARCH 2023 RESULTS
VOCATIONAL
FIRST YEAR BRIDGE COURSE RESULT
VOCATIONAL
SECOND YEAR BRIDGE COURSE RESULTS
====================
====================
UPDATE 27-04-2023
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు
ఇంటర్ ఫలితాల గురించి ఏప్రిల్ 27 నుంచి మే 6వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని చెప్పారు. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్ 1 వరకు వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందన్నారు.
ముఖ్యమైన తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 27/04/2023 నుంచి 06/05/2023 వరకు
సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 27/04/2023 నుంచి 03/05/2023 వరకు
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 24/05/2023 నుంచి 01/06/2023 వరకు
DOWNLOAD
PRESS NOTE ON RV & RV DETAILS
DOWNLOAD
PRESS NOTE ON SUPPLIMENTARY EXAMS
====================
UPDATE 26-04-2023
ఫలితాలు విడుదల
ఏపీలో ఇంటర్
ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. మార్చి 15
నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ
సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే
పైచేయి సాధించినట్టు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 4,33,275 మంది విద్యార్థులు
పరీక్షకు హాజరుకాగా అందులో 2,66,326 (61శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో
బాలికలు 65 శాతం, బాలురు 58శాతం
ఉన్నట్టు చెప్పారు.
ఇంటర్
ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,79,750 మంది విద్యార్థులు హాజరు కాగా, 2,72,001 మంది (72శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో
బాలికలు 75 శాతం, బాలురు 58 మంది
ఉన్నట్టు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా
జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 70శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 68 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
ఇంటర్ సెకండ్ ఇయర్లో 83శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా, 78శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానం, 77శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి తృతీయ స్థానంలో నిలిచాయని మంత్రి తెలిపారు.
======================
RESULTS LINKS 👇👇👇
======================
INTER 1ST YEAR (GENERAL)
RESULTS LINKS
======================
INTER 1ST YEAR (VOCATION)
RESULTS LINKS
======================
INTER 2ND YEAR (GENERAL)
RESULTS LINKS
======================
INTER 2ND YEAR (VOCATION)
RESULTS LINKS
======================
UPDATE 25-04-2023
పరీక్షల ఫలితాలు
ఏప్రిల్ 26 న విడుదల
ఇంటర్మీడియట్
పరీక్షల ఫలితాల విడుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఈ నెల 26వ తేదీన ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్
బోర్డు ప్రకటించింది. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో బోర్డు
పేర్కొంది.
====================
UPDATE 04-03-2023
ఏపీ: ఇంటర్
పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్షల
షెడ్యూల్: మార్చి 15 నుంచి ఏప్రిల్ 03 వరకు
Note:
1) For First Year
Students: Enter First Year/SSC Hall Ticket Number
2) For Second Year
Students: Enter Second Year/First Year Hall Ticket Number
====================
UPDATE 11-01-2023
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్పు - ఫిబ్రవరి 26 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ
ఇంటర్మీడియట్ బోర్డు కొత్త షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు
గతంలో ప్రకటించిన విధంగానే జరుగుతాయని స్షష్టం చేసింది.
జనరల్ కోర్సుల విద్యార్ధులకు ఫిబ్రవరి 26నుంచి మార్చి 7వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు
నిర్వహించనున్నట్లు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పేర్కొంది.
వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 20నుంచి మార్చి 7వ తేదీ వరకు (16రోజులు)
నిర్వహించనున్నారు. (ఆదివారాలతో సహా) ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్స్‌లో ఉదయం
9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు
నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష
ఫిబ్రవరి 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 17న నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది.
====================
రాష్ట్రం లో ఇంటర్
వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు
అధికారులు సోమవారం విడుదల చేశారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్ లలో జరపాలని
అధికారులు నిర్ణయించారు. మొదటి సెషన్ ఏప్రిల్ 15 నుండి 25 వరకు, రెండవ సెషన్ ఏప్రిల్ 30 నుండి మే 10 వరకు జరుగును.
====================
====================
ఇంటర్ పరీక్షల
తేదీలు: 15/03/2023 నుండి 04/04/2023 వరకు
ప్రాక్టికల్ పరీక్షల తేదీలు:
మొదటి సెషన్: 15/04/2023 నుండి 25/04/2023 వరకు, రెండవ సెషన్: 30/04/2023 నుండి 10/05/2023 వరకు
‘ETHICS and HUMAN
VALUES’ పరీక్ష తేదీ: 22/02/2023
‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 24/02/2023
====================
====================
0 Komentar