CBSE Exams 2023: PIB Warns Students of
Fake Website Asking Registration Fees
సీబీఎస్ఈ
పరీక్షలు 2023: నకిలీ వెబ్సైట్ గురించి పీఐబీ హెచ్చరిక
– వివరాలు ఇవే
సైబర్
నేరగాళ్లు తాజాగా సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులే
లక్ష్యంగా మోసాలకు దిగారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)
పేరిట ఓ నకిలీ వెబ్సైట్ తెరిచి కొత్త దందాకు తెరతీశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో
డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)
అప్రమత్తమైంది.
ఇలాంటి నకిలీ
వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ట్విటర్ వేదికగా ఫ్యాక్ట్చిక్
అలర్ట్ జారీ చేసింది. www.cbsegovt.com పేరిట ఓ నకిలీ
వెబ్సైట్లో అడ్మిట్కార్డు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టాలని ఫేక్ లింక్
చూపిస్తోందంటూ పీఐబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సైట్కు ఎలాంటి అనుమతీ లేదని పీఐబీ
తెలిపింది.
కేవలం www.cbse.gov.in, www.cbse.nic.in మాత్రమే సీబీఎస్ఈకి చెందిన అధికారిక వెబ్సైట్లు అని పేర్కొంది. పరీక్ష తేదీలు, డేటా షీట్లు, పరీక్షా
ఫలితాలు మొదలైన సమాచారం కోసం అధికార వెబ్ సైట్లను సంప్రదించాలని తెలిపింది. ఏదైనా
సమాచారం తనిఖీ చేసేటప్పుడు అసలుదా? నకిలీదా? అనేది చెక్ చేసుకోవాలని సూచించింది.
⚠️FRAUD ALERT⚠️
— PIB Fact Check (@PIBFactCheck) December 14, 2022
A registration fee is being demanded from students on a fake website (https://t.co/ufLUWFe0lK) for appearing in board examinations#PIBFactcheck
▶️This website is not associated with @cbseindia29
▶️Official website of CBSE is "https://t.co/8Y8fKLU0Mu" pic.twitter.com/0CndyxoVm0
0 Komentar