Pariksha PeCharcha 2023 - All the Details
=======================
దేశ ప్రధాన మంత్రి
నరేంద్రమోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఇందుకు ఢిల్లీలోని తాల్కటోరా
ఇండోర్ స్టేడియం వేదికైంది. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి
మాట్లాడారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు
తెలుస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంపై ఇంతకుముందు ప్రధాని ట్విటర్లో స్పందించారు. ఈ
రోజు ఇలా చిన్నారుల మధ్య ఉండటం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు.
అమ్మ ను
చూసి సమయపాలన నేర్చుకోండి
‘సమాజం నుంచి
వచ్చే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలపై భారీ అంచనాలు
పెట్టుకుంటే అది పెద్ద సమస్య. మేం రాజకీయాల్లో ఉన్నాం. విజయం కోసం మాపై కూడా
భారీస్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఒక క్రికెటర్ మైదానంలోకి వెళ్లిన తర్వాత గ్యాలరీలో
ఉన్న ప్రేక్షకులపై కాకుండా బంతిపైనే దృష్టిపెడతాడు. మనం మన సామర్థ్యాన్ని అర్థం
చేసుకోవాలి. ఎప్పుడూ లక్ష్యం సాధించే దిశగానే దృష్టిపెట్టాలి. ఇక్కడ మీకు మన అమ్మల
గురించి చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ అమ్మ సమయపాలనను గమనించారా..? రోజూ తాను ఇంట్లో చేసేపనిని భారంగా భావించదు. మీ అమ్మను
గమనిస్తే.. సమయాన్ని ఎలా సమర్థవంతంగా వాడుకోవాలో 'మీకు అర్థమవుతుంది'అని ఇంటి నుంచి
నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు మోదీ.
నో షార్ట్
కట్స్ ..
'కొందరు
విద్యార్థులు తమ సృజనను పరీక్షల్లో చీటింగ్ చేయడం కోసం వాడుతుంటారు. అదే సమయాన్ని, సృజనను మంచి మార్గంలో పెట్టే దిశగా వాడితే.. వారు తప్పక
గొప్ప విజయాలు సాధిస్తారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు.
కొంతమంది విద్యార్థులు పరీక్షల సమయంలో ఎంతో శ్రమిస్తారు. ఆ శ్రమ ఎప్పటికీ వృథా
కాదని నేను హామీ ఇస్తున్నాను అని ప్రధాని వారితో అన్నారు.
హార్డ్ వర్క్
లేక స్మార్ట్ వర్క్..?
'స్మార్ట్
వర్క్ లేక హార్డ్ వర్క్'ఏదీ ముఖ్యమైంది సర్ అంటూ
ప్రధానిని ఓ విద్యార్థి ప్రశ్నించారు. 'కొంతమంది
చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు' అని ఆయన చమత్కరించారు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి
చేసుకోవాలని, దానికి తగ్గట్టే పనిచేసి, అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.
It is an absolute delight to be among my young friends! Join #ParikshaPeCharcha. https://t.co/lJzryY8bMP
— Narendra Modi (@narendramodi) January 27, 2023
=======================
DATE: 27-01-2023
TIME:
11.00 AM
YOUTUBE
LINK:
PM
OFFICIAL CHANNEL
https://www.youtube.com/watch?v=U5MG3XpDMcA
=======================
DD
SAPTAGIRI:
https://www.youtube.com/watch?v=-ZdvXIRnvdg
=======================
DD YADAGIRI:
https://www.youtube.com/watch?v=oLHN0DNhypo
=======================
=======================
UPDATE 04-01-2023
పరీక్షా పే
చర్చ – 2023 తేదీ ఖరారు
తేదీ: 27/01/2023
పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా
నిర్వహించే 'పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి తేదీ ఖరారైంది.
జనవరి 27న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఈ కార్యక్రమం ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో
జరుగుతుందని పేర్కొంది. పరీక్షలు రాసే విద్యార్థులతో మోదీ మాట్లాడతారని తెలిపింది.
ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొమ్మిది నుంచి 12 తరగతులు
చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
రిజిస్టర్ చేసుకొనేందుకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 30వరకు అవకాశం
కల్పించారు.
‘మైగవ్’ వెబ్సైట్లో పోటీల ద్వారా
ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్లను బహుమతిగా అందజేయనున్నట్టు
అధికారులు తెలిపారు. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా
మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.
=======================
పరీక్షా పే
చర్చ – 2023 గురించి ప్రొసీడింగ్స్ విడుదల – వివరాలు
ఇవే
Rc. No:2/Spl/SCERT/2022,
Dated:22-12-2022
Sub: School Education - MOE, GOI - 6th Edition of Pariksha PeCharcha - The Unique interactive Program of Hon'ble Prime Minister with Students, Teachers & Parents - January 2023 State Participation - Selection for quota -Short listing the students' registration -At erstwhile districts - Regarding.
Ref:-
1. Lr.No. from
D.O.No.6-1/2022-Desk(PMP)-Part(2) MS.AnitaKarwal, IAS, Secretary dated 28th
November 2022. 2. Lr. No. D.O.No.6-1-Desk (PMP) from Mr. Prachi Pandey, Joint
Sectretary (EE.1) dated 2nd December 2022.
3. Memo.No.11-A&I-2019 Dated: 07th
December 2022.
The attention of all the Regional Joint
Directors, District Educational Officers and principals of DIETS of erstwhile
districts is invited to the reference cited, that the Government of India has
been conducting a flagship program called "Pariksha Pe Charcha" and a
creative writing competition is being conducted at
https://innovateindia.mygov.in/ppc-2023/ on various topics between 25th
November 2022 and 30th December 2022 from class 9th to 12th students, teachers
& parents.
2. In order to select participants in
"Pariksha Pe Charcha" programme, the registered students data of
erstwhile districts will be shared with the Principals of respective DIETS
through mail, from time to time. The DEOS of erstwhile districts are instructed
to coordinate with the Principals DIET to grade and sort out the entries of the
students through the verification of the write-ups and questions to Prime
Minister submitted by the Students.
3.The Principals DIET are to ensure that
the final selected top 50 entries, under Students' category from the respective
erstwhile districts by 27th December 2022 (Tuesday), 5PM to the State Nodal
Officer 0/0 CSE at ppc2023apcse@gmail.com without fail.
4. In this context, the DEOS/ Principals
DIETS are instructed to take utmost care in coordinating and completing the
task before the due date 27th December 2022 (Tuesday), 5PM.
5. The following are the guidelines to
be followed in the selection of final entries:
i) Principals of DIETS respective districts
are the District Nodal Officers, to liaison with the state office for the
purpose of completing this event.
ii) to depute the teaching faculty of
DIETS to sort out the list. They are required to check the write ups submitted
by the students in given eight themes, grade them into A, B, C and D (List
Enclosed).
iii) further the 'A' graded- top most 10
Students list and total list (A, B, C & D graded) are to be shared
separately with state Nodal Officer mail id, Pareeksha Pe charcha 2023.
iv)The team involved in the programme
has to maintain the confidentiality. Any deviations from this, will be viewed
seriously.
4. If any further details contact Smt.
Venkata Lakshmamma (Deputy Diretor), State Nodal Officer, O/O CSE, Amaravati on
Mob.9618403057.
Encl. Annexure-II (Themes).
=======================
=======================
#ParikshaPeCharcha2023 Date Announced!
— Ministry of Education (@EduMinOfIndia) January 3, 2023
The wait is over! #PPC2023 is going to be held on 27th January 2023 at Talkatora Indoor Stadium, New Delhi.
Hon’ble PM Shri @narendramodi will interact with students, parents, and teachers. Stay Tuned! #ExamWarriors pic.twitter.com/9DVFiReEaQ
0 Komentar