Pele, One of The Greatest of All Time
Foot Ball Player, Passes Away
ఫుట్ బాల్ అత్యుత్తమ
ఆటగాడు ‘పీలే’ ఇక లేరు
ఫుట్ బాల్
అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్
తో పోరాడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు ధ్రువీకరించారు. క్యాన్సర్ బారిన పడ్డ
పీలేకు గతేడాది సెప్టెంబర్లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్ కణితిని తొలగించారు.
అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి
విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు
డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో పీలే ఈ లోకాన్ని
విడిచి వెళ్లారు. పీలే కన్నుమూయడంతో దేశాధినేతలు, క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.
దిగ్గజ
ఆటగాడిగా
1940 అక్టోబర్
23న జన్మించిన పీలే తన మంత్ర ముగ్ధమైన
ఆటతీరుతో సాకర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడిగా వెలుగొందాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్లలో
బ్రెజిల్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీలే.. సుమారు రెండు దశాబ్దాలపాటు
ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మూడు ప్రపంచకప్ లు అందుకున్న ఏకైక వ్యక్తిగా పీలే
నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పేరు
లిఖించుకున్న పీలే.. 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం
చేశాడు. 92 మ్యాచ్ 77 గోల్స్ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా
నిలిచాడు.
0 Komentar