SSC CHSL 2020: Final Results Released –
All the Details Here
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2020: తుది ఫలితాలు విడుదల – ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే
స్టాఫ్
సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కంబైన్డ్
హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్' (సీహెచ్ఎస్ఎల్) 2020 తుది ఫలితాలు డిసెంబర్ 7న విడుదలయ్యాయి.
వివిధ కేంద్ర
ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ
సంస్థలు,
ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 4791 లోయర్ డివిజనల్ క్లర్క్
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ
ఆపరేటర్స్ తదితర పోస్టుల భర్తీకి ఎన్ఎస్సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
టైర్-1,
2, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం
4685 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఎంపికైన /
ఎంపికకాని అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలు డిసెంబర్ 14న వెబ్సైట్ లో అప్లోడ్ చేయనున్నట్లు, ఇది డిసెంబర్ 28 వరకు అందుబాటులో కమిషన్ పేర్కొంది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.
0 Komentar