TS - SET-2022: Telangana State Eligibility Test - All the
Details Here
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్ సెట్) - 2022 – పూర్తి వివరాలు ఇవే
========================
UPDATE
25-04-2023
ఫలితాలు విడుదల
HALL
TICKET NOs SELECTED CANDIDATES
XUT
OFF SHEET- SUBJECT WISE/CATEGORY WISE
SUBJECT
WISE- REGISTERED/ APPEARED/ QUALIFIED DETAILS
========================
తెలంగాణ
రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్) -2022 వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం
నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర
ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఓయూ చూస్తోంది.
జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో
పరీక్ష జరుగనుంది.
తెలంగాణ
రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)- 2022
సబ్జెక్టులు:
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్ 1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్
సైన్సెస్,
జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్
సైన్సెస్,
ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
అర్హత: కనీసం
55% మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎస్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్ఈ, ఐటీ)) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష
విధానం: కంప్యూటర్ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు
ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి -
మూడు గంటలు.
పరీక్ష
రుసుం: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్
కు రూ.1500;
ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్ జెండర్లకు
రూ.1000.
పరీక్ష
కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 30-12-2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2023
(ఆలస్య రుసుం రూ.1500, రిజిస్ట్రేషన్ ఫీజుతో 25-01-2023; ఆలస్య రుసుం రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజుతో 31-01-2023; ఆలస్య రుసుం రూ.3000, రిజిస్ట్రేషన్ ఫీజుతో 05-02-2023).
పరీక్ష తేదీ:
మార్చి,
2023.
0 Komentar