Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Notification Released for 185 Veterinary Assistant Surgeon (Class-A & B) - Details Here

 

TSPSC: Notification Released for 185 Veterinary Assistant Surgeon (Class-A & B) - Details Here

టీఎస్ పీఎస్సీ - తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630.

=======================

తెలంగాణ రాష్ట్రంలోని వెటర్నరీ & పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ & బి)పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నోటిఫికేషన్ (23/2022) విడుదల చేసింది. మల్టీ జోన్-1, మల్టీ జోన్-2లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు డిసెంబర్ 30 నుంచి 2023 జనవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల భర్తీకి రాతపరీక్ష 2023 మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఖాళీల వివరాలు:

1. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ): 170 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత.

2. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి): 15 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ), పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిప్లొమా (మైక్రోబయాలజీ / పారాసిటాలజీ / ఎపిడెమియాలజీ / వైరాలజీ / ఇమ్యునాలజీ / పాథాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా ఎంవీఎస్సీ(వెటర్నరీ పబ్లిక్ హెల్త్) ఉత్తీర్ణులై ఉండాలి.

మొత్తం ఖాళీలు: 185.

వయోపరిమితి: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 .

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా ఎంపిక చేస్తారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్పేపర్-2లో వెటర్నరీ సైన్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. పేపర్-1లో 150 ప్రశ్నలకు 150 మార్కులుపేపర్-2లో 150 ప్రశ్నలకు 300 మార్కులు. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు & పరీక్ష రుసుము: రూ.320.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30/12/2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19/01/2023.

రాతపరీక్ష నిర్వహణ తేదీలు: 2023 మార్చి 15, 16.

=======================

APPLY HERE

NOTIFICATION

WEB NOTE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags