UPSC Civil Services Mains 2022: Final Results
Released
యూపీఎస్సీ సివిల్
సర్వీసెస్ మెయిన్స్-2022 - తుది ఫలితాలు విడుదల
==========================
UPDATE
23-05-2023
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2022 తుది ఫలితాలు విడుదల
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ - 2022 తుది ఫలితాలు
విడుదల అయ్యాయి. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.
ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్ కు 38, ఐపీఎస్ కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్లో 131 మంది
ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది.
==========================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 ఫలితాలను డిసెంబర్ 6న
విడుదలైనట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు
సివిల్స్ ప్రధాన పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన
అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు హాజరు కావాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థులకు డీటైల్డ్ అప్లికేషన్ ఫాం- 2 అందుబాటులో ఉంటుందని, డిసెంబర్ 14లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది.
0 Komentar