WhatsApp in 2022: Top Features Rolled
Out This Year
వాట్సాప్ 2022:
ఈ సంవత్సరం వాట్సాప్ లో వచ్చిన టాప్ ఫీచర్ల వివరాలు ఇవే
వాట్సాప్ (WhatsApp) ఈ ఏడాది (2022) యూజర్లకు ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్లను పరిచయం చేసింది. కేవలం టెక్స్ట్ మెసేజింగ్, కాలింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా పోల్, మెసేజ్ యువర్ సెల్ఫ్, కమ్యూనిటీస్ వంటి కొత్త ఫీచర్లతో వాట్సాప్ ఫీచర్ రిచ్ యాప్ మారిపోయింది. అంతేకాదు, మెసేజ్ లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి పటిష్ఠ భద్రతను సైతం అందిస్తోంది.
ఇన్ని రకాల సేవలను అందిస్తున్నా.. ప్రకటనలు మాత్రం చూపించడం
లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లు కలిగిన యాప్ వాట్సాప్ అవతరించింది.
ఈ క్రమంలో మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
మరి, 2022లో వాట్సాప్ (Year Ender 2022) తీసుకొచ్చిన ది బెస్ట్ ఫీచర్లేంటో తెలుసుకుందాం..
1. Message Reaction
పదాల్లో చెప్పలేని ఎన్నో మాటలు కేవలం భావాల్లో
వ్యక్తపరచవచ్చు. ఇదే ఆలోచనతో వాట్సాప్ మెసేజ్ రియాక్షన్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వాట్సాప్లో వచ్చే
మెసేజ్లకు ఎమోజీలతో స్పందన తెలియజేయొచ్చు. ఇందుకోసం మెసేజ్ పక్కనే ఉన్న ఎమోజీ
సింబల్పై క్లిక్ చేసి యూజర్ తనకు నచ్చిన ఎమోజీని పంపొచ్చు. ఈ ఏడాది వాట్సాప్
తీసుకొచ్చిన వాటిలో ఇదే ది బెస్ట్ ఫీచర్ గా ఎక్కువ మంది యూజర్లు
అభిప్రాయపడుతున్నారు.
2. మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు (Message Yourself)
వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ లు ఏవైనా సేవ్ చేసుకోవాలంటే.. డమ్మీ గ్రూపు
క్రియేట్ చేసేవారు. కానీ, మీ ఫోన్లో వాట్సాప్ ఖాతా
నుంచి మీ వాట్సాప్ నంబర్కే మెసేజ్ పంపేలా మెసేజ్ యువర్సెల్ఫ్ పేరుతో వాట్సాప్ ఈ
ఏడాది కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది.
వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత చాట్ మెసేజ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాంటాక్ట్
లిస్ట్ కనిపిస్తుంది. అందులో మొదట మీ పేరు ఫోన్ నంబర్ తోపాటు బ్రాకెట్లో యూ అని
ఉంటుంది. దానిపై క్లిక్ చేసి సెల్ఫ్ మెసేజ్ చేసుకోవచ్చు.
3. అవతార్ (Avatar)
వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు బదులు మన అవతార్ ఉంటే బాగుంటుందని
ఎంతో మంది కోరుకుంటారు. వాట్సాప్ కొత్తగా అవతార్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్
కోసం వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అవతార్ అనే సెక్షన్ కనిపిస్తుంది. దానిపై
క్లిక్ చేసి మీకు నచ్చిన రీతిలో అవతార్ ను క్రియేట్ చేయొచ్చు. కొత్తగా రూపొందించిన
అవతార్ ను ఆత్మీయులతో షేర్ చేసుకోవడంతోపాటు.. ప్రొఫైల్ పిక్చర్ గానూ వాడుకోవచ్చు.
4. కమ్యూనిటీస్ (Communities)
ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్
చేసుకునేందుకు వీలుగా కమ్యూనిటీస్ ఫీచర్ ను పరిచయం చేశారు. 20 గ్రూప్లను ఒకేసారి
కమ్యూనిటీస్ లోకి తీసుకురావచ్చు. అడ్మిన్ ఏదైనా సమాచారాన్ని షేర్ చేస్తే 20 గ్రూప్
లలో ఉన్న సభ్యులందరికీ తెలుస్తుంది.
వీటికి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుంది.
5. వాట్సాప్ లో పోలింగ్ (WhatsApp Poll)
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మెజార్టీ సభ్యుల అభిప్రాయం
తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ పోల్ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇందులో గరిష్ఠంగా 12 ఆప్షన్లు
ఉంటాయి. గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా పోల్ క్రియేట్ చేసి సభ్యులతో షేర్ చేస్తే, వారు తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసి పోల్లో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్ కోసం
యూజర్లు ఫైల్ అటాచ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే పోల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని
ఓపెన్ చేసి పోల్ క్రియేట్ చేయొచ్చు.
6. వీడియో కాల్ లింక్ (Create Call Link)
ఈ ఫీచర్ యూజర్ జూమ్, గూగుల్ మీట్
తరహాలో లింక్ క్రియేట్ చేసి వీడియో / ఆడియో కాల్ ఇన్విటేషన్ పంపవచ్చు. యూజర్లు ఆ
లింక్ ను క్లిక్ చేసి నేరుగా వీడియో కాల్ లో పాల్గొనవచ్చు. ఆన్లైన్ సమావేశం
నిర్వహించాలనుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సాప్
అభిప్రాయపడింది.
7. గ్రూప్ సభ్యులపై పరిమితి (1024 Group)
గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా
చేర్చుకునే వెసులుబాటు ఉండేది. తర్వాత సంఖ్య 512గా మారింది. ఈ ఏడాది ఆ సంఖ్యను
1024కి పెంచుతూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందితో
సమాచారాన్ని సులువుగా షేర్ చేయవచ్చు.
0 Komentar