Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp New Feature: Message Yourself – Details Here

 

WhatsApp New Feature: Message Yourself – Details Here

వాట్సాప్ లో కొత్త ఫీచర్ -  మీ నెంబర్ నుండి మీ నెంబర్ కే మెసేజ్ పంపుకొనే అవకాశం

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు శుభ వార్త. ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ యూజర్లు (iPhone Users) ఎవరైనా వాట్సాప్‌లో తమకు తామే (Message Yourself on WhatsApp) మెసేజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ కొత్తది కాదు.. WhatsApp URL లింక్‌ని ఉపయోగించి మీ సొంత ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపే ఆప్షన్ ఎప్పుటినుంచో అందుబాటులో ఉంది. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌లో మెసేజ్‌ను మీకు మీరే ఎలా పంపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వాట్సాప్ (WhatsApp) ఓపెన్ చేయండి. కింది కుడి వైపున ఉన్న New Chat బటన్‌ను Click చేయండి. కాంటాక్టుల లిస్టులో ‘Message Yourself’ లేబుల్‌తో మీ సొంత ఫోన్ నంబర్‌తో మెసేజ్ పంపుకోవచ్చు.

Note: మీరు చాట్‌ని ఓపెన్ చేయగానే మీ కాంటాక్టు నంబర్‌పై నొక్కండి. కానీ, Next బటన్‌పై క్లిక్ చేసి ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి. తద్వారా మీరు చాట్ విండోలో మీ ఫోన్ నంబర్‌ను సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.

2. మీ iPhone లేదా Android ఫోన్‌లో ‘Contacts’ యాప్‌కి వెళ్లండి. ఆపై, మీ పర్సనల్ ఫోన్ నంబర్‌ను మీ డివైజ్‌లో Save చేయండి.

3. మీ ఫోన్ నంబర్‌ను Save చేయడం ద్వారా మీరు ‘Message Yourself’ చాట్‌లో కాంటాక్టు పేరును చూపేలా చేస్తుంది. అదే ట్రాక్ చేయడం సులభం అవుతుంది. మీరు ఇప్పుడు ఈ చాట్ విండోను ఉపయోగించి వెబ్ (Web) మొబైల్‌ (Mobile)లో రిమైండర్‌లుగా సెట్ చేసుకోవచ్చు లేదా ఫైల్‌లను Share చేసుకోవచ్చు.

4. అలాగే, మీరు ఏవైనా ఫోటోలు లేదా వీడియోలను సేవ్ చేసేందుకు చాట్ విండోలో మీడియా పక్కన ‘Forward’ బటన్‌ను Tap చేయండి. ఆ తర్వాత, WhatsAppలోని కాంటాక్టుల లిస్టు నుంచి ‘Message Yourself’ చాట్‌ని ఎంచుకోండి.

5. వాట్సాప్ వెబ్ (Whatsapp Web) ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ చాట్ విండోలో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యమైన డేటాను కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు ఈ చాట్‌లో మీకు వాయిస్ నోట్స్ (Voice Notes) కూడా పంపుకోవచ్చు.

వాట్సాప్‌లో మీకు మీరే మెసేజ్ చేస్తే ఏమౌతుందంటే?

వాట్సాప్ (WhatsApp) ద్వారా మీ కాంటాక్టులో ‘Message Yourself’ ఫీచర్ వినియోగదారుతో 1:1 చాట్‌ను క్రియేట్ చేయవచ్చు. వారు టెక్స్ట్‌లను పంపడానికి, లిస్టులను క్రియేట్ చేయడానికి రిమైండర్‌లను సెట్ చేసేందుకు ముఖ్యమైన డేటాను సేవ్ చేసేందుకు అనుమతిస్తుంది. వాయిస్ నోట్స్ (Voice Notes), ఫోటోలు (Photos), వీడియోలు (Videos) ఇతర కంటెంట్‌ను పంపేందుకు చాట్ విండోలను ‘Message Yourself’ ఫీచర్ ఉపయోగించవచ్చని వాట్సాప్ తెలిపింది.

UPDATE LATEST VERSION APP

Previous
Next Post »
0 Komentar

Google Tags